MLA SRAVANI: ఎస్సీల అభివృద్ధికి సహకరించండి
ABN , Publish Date - Mar 14 , 2025 | 12:07 AM
నియోజకవర్గంలోని ఎస్సీల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామికి విన్నవించారు. గురువారం వెలగపూడి సచివాలయంలో మంత్రిని ఎమ్మెల్యే కలిశారు.

శింగనమల మార్చి 13(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని ఎస్సీల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామికి విన్నవించారు. గురువారం వెలగపూడి సచివాలయంలో మంత్రిని ఎమ్మెల్యే కలిశారు. ఎస్సీ కాలనీలు, వసతి గృహాల్లో సమస్యలపై మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ ఎస్సీల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోననే సాధ్యమని, నియోజకవర్గంలోని ఎస్సీ కాలనీలో సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే ఎస్సీ వసతి గృహాలలో సౌకర్యాలు కల్పనకు నిధులు మంజూరు చేయాలన్నారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
పోలీస్ స్టేషన్లలో సౌకర్యాలు కల్పించండి
నియోజకవర్గంలోని పోలీ్‌సస్టేషన్లలో సౌకర్యాలు కల్పించేందుకు నిధులు మంజారు చూయాలని హోంమంత్రి అనితను ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కోరారు. బుధవారం సచివాలయంలోని హోంమంత్రి అనితను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని శింగనమల, పుట్లూరు పోలీసుస్టేషన్లకు శింగనమల సర్కిల్ కార్యాలయం కొత్త భవనాలను నిర్మించాలని కోరారు.