Ex MLA : శిలాఫలకాలు మార్చడం సరికాదు
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:22 AM
రాజకీయంగా కొన్ని సంప్రదాయాలు ఉంటా యని, ఏ ప్రభుత్వం అధి కారంలో ఉన్నా... శిలా ఫలకాలను ఏర్పాటు చేసే సందర్భంలో రాజకీ యాలకు అతీతంగా ప్ర జాప్రతినిధులు, సభ్యుల పేర్లు చేర్చడం అనవా యితీ అని టీడీపీ జాతీ య ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు.

- చట్ట పరిధిలో అధికారులే బాధ్యులవుతారు
- టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం
అనంతపురం మార్చి 12 (ఆంధ్రజ్యోతి) : రాజకీయంగా కొన్ని సంప్రదాయాలు ఉంటా యని, ఏ ప్రభుత్వం అధి కారంలో ఉన్నా... శిలా ఫలకాలను ఏర్పాటు చేసే సందర్భంలో రాజకీ యాలకు అతీతంగా ప్ర జాప్రతినిధులు, సభ్యుల పేర్లు చేర్చడం అనవా యితీ అని టీడీపీ జాతీ య ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు. అలా కాకుండా శిలాఫలకాలను మార్చడం సరికాదన్నారు.ఆయన బుధవారం నగరం లోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో మాట్లాడుతూ... నగరంలో దురదృష్టవశాత్తు గతంలో ఎన్న డూ లేని విధంగా వింత పోకడలు జరుగుతున్నాయన్నారు. తాను ము న్సిపల్ చైర్మనగా ఎంపికైన సమయంలో సప్తగిరి సర్కిల్ సమీపంలోని ప్రాంతాన్ని వినాయక చౌక్‌గా, మరో సర్కిల్‌ని చాందిని సర్కిల్‌గా ఆ యా వర్గాలు పేరు పెట్టుకున్నారన్నారు. తాను అప్పట్లో ఆయా కమిటీ సభ్యులను ఒప్పించి, వినాయక చౌక్‌ను బాలగంగాధర్ తిలక్ సర్కిల్ గా, చాందిని చౌక్‌కు అబుల్ కలామ్ అజాద్ పేరు పెట్టామన్నారు. అలాగే ముస్లిం మైనార్టీ నాయకులతో కమిటీని ఏర్పాటు చేసి, విగ్ర హాన్ని ఏర్పాటు చేశామన్నారు. నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా నగరంలోని పలు విగ్రహాలను తొలగించారన్నారు.
తాను మానవ తా వాదిగా కలెక్టరేట్ ఎదుట ఫాదర్ ఫెర్రర్ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేశానన్నారు. రోడ్డు పనులు పూర్తి కాగానే మిగిలిన విగ్రహాలను నిర్దే శించిన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని అప్పట్లో సంబంధిత అధికారు లు చెప్పారని గుర్తు చేశారు. అయితే ఈ మధ్య కాలంలో ఆగమేఘా లపై అబుల్ కలామ్ ఆజాద్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, అయితే ఆర్‌అండ్‌బీలో పాత శిలాఫలకాలు ఉన్నప్పటికీ కొత్త పేర్లతో శిలాఫకలా న్ని ఏర్పాటు చేశారన్నారు. దీనిపై ఓ ముస్లిం కమిటీ సభ్యుడు ఆర్ అండ్‌బీ అధికారులకు లేఖరాసినా, నగర పాలక సంస్థ అధికారులను తాము ప్రశ్నించినా సరైన సమాధానం లేదన్నారు. గడచిన దశాబ్దాల కాలంలో ఇలాంటి సంఘటనలు జరగలేదన్నారు. తాను ఒక పార్టీలో క్రమశిక్షణతో ఉన్నందున మౌనం వహిస్తున్నానన్నారు. లేని పక్షంలో ప్రజా సంఘాలను కలుపుకొని నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ము ట్టడించగలమని అధికారులకు స్పష్టం చేశానన్నారు. ఈ వ్యవహారంపై విగ్రహ ఏర్పాటు కమిటీ సభ్యుల ద్వారా హైకోర్టును ఆశ్రయించామని, 60 రోజుల్లోపు పాత శిలాఫకలాలను తిరిగి ఏర్పాటు చేయాలని, లేదం టే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని సంబం ధిత అఽధికారులకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఇప్పటికే 60 రోజుల సమ యం పూర్తి అయిందన్నారు. అధికారులు చొరవ తీసుకొని జరిగిన తప్పును సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. లేని పక్షంలో హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు వేయాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....