DHARNA : నాలుగు నెలలుగా జీతాల్వికుంటే ఎలా..!
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:23 AM
నాలుగు నెలలుగా జీతాల్వికుంటే ఎలా బతికే దని ఏపీ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ వర్కర్లు, ఏఐటీయూసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ తమ సమస్యలను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమ వారం కలెక్టరేట్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మెడికల్ కాంట్రాక్టు ఉద్యోగులు నిరసన తెలిపారు.

- కలెక్టరేట్ వద్ద కాంట్రాక్ట్ కార్మికుల నిరసన
అనంతపురం విద్య, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): నాలుగు నెలలుగా జీతాల్వికుంటే ఎలా బతికే దని ఏపీ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ వర్కర్లు, ఏఐటీయూసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ తమ సమస్యలను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమ వారం కలెక్టరేట్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మెడికల్ కాంట్రాక్టు ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మెడికల్ యూనియన నాయకులు చింరజీవి, మనోహర్, వెంకటేష్ మాట్లాడుతూ... తమకు నాలుగు నెలలు నుంచి జీతాలు పెండింగ్‌లో ఉంచారన్నారు. ఉద్యోగుల సమస్యలపై కలెక్టర్ దృష్టి సారించాలన్నారు. పీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లించని కాం ట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వాసుపత్రిలో, మెడికల్ కాలేజి, సూపర్ హాస్పెటల్‌లో పనిచేసే సెక్యూరిటీ గార్డుల సమస్యలను సైతం పరిష్కరించాలన్నారు. ఎమ్మెల్యే స్పందించాలని డిమాండ్ చేశారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....