Home » Amaravati
ప్రభుత్వ ఉద్యోగుల్లో సామర్థ్య నిర్మాణం, పరిపాలనా నైపుణ్యాల పెంపు లక్ష్యంగా మిషన్ కర్మయోగిపై దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వర్క్‌షాప్ జరగనుంది. ఈ నెల 29, 30 తేదీల్లో విజయవాడలోని బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో ఈ సదస్సును నిర్వహించనున్నారు.
టీటీడీ గోశాలలను జంతు సంక్షేమం, పరిశుభ్రత, భద్రత, సౌకర్యాల పరంగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కోరారు.
రెవెన్యూ అంశాలపై సమాచార హక్కు చట్టం దరఖాస్తుల విషయంలో ఆర్టీఐ కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అర్జీదారులు నిర్దిష్ట అంశాలను ప్రశ్నల రూపంలో అడిగినా అధికారులు విధిగా సమాధానం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.
రాష్ట్రంలోని హస్తకళల వారసత్వాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నట్లు లేపాక్షి హస్తకళల అభివృద్ధి సంస చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు.
ఫార్మా పరిశ్రమలు వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా నేరుగా గెడ్డలు, చెరువుల్లోకి విడిచిపెట్టడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో గల ఫార్మా సిటీలోని పలు కంపెనీలు నాలుగు రోజుల క్రితం భారీ వర్షాలు కురిసినప్పుడు వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా బయటకు విడిచిపెట్టేశాయి.
వీఐటీ-ఏపీ యూనివర్సిటీ ఆరో స్నాతకోత్సవం శనివారం అమరావతిలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 86 మంది పీహెచ్‌డీ స్కాలర్లతో కలిపి మొత్తం 3,877 మంది గ్రాడ్యుయేట్లకు డిగ్రీలు ప్రదానం చేశారు.
విజయవాడ నగరంతోపాటు ఎన్టీఆర్ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న పేదల ఇళ్ల పట్ట్టాల క్రమబద్ధీకరణపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
రాయలసీమను ప్రపంచస్థాయి ఉద్యాన కేంద్రంగా తీర్చిదిద్ది.. రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్- రైజింగ్ రాయలసీమ’ కార్యక్రమాన్ని ప్రజా భాగస్వామ్యంతో..
తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు రిజర్వాయర్లకు వరంగా మారాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈనెల 23 నాటికి 29 రిజర్వాయర్లలో నీటి మట్టాలు 101 టీఎంసీలు ఉండగా, శనివారానికి అవి 21 టీఎంసీల మేర పెరిగాయని గుర్తించింది.
సౌత్‌ఈస్ట్రన్ రైల్వేలో నాన్-ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా డిసెంబరులో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.