Home » Amaravati
మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో టమోటా కొనుగోలు చేస్తామని ఆ శాఖ ఏడీ రాఘవేంద్ర కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులు టమోటా కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలని సూచించారని తెలిపారు.
శ్రీశైలం రిజర్వాయర్కు ఎగువ జూరాల స్పిల్వే, సుంకేసుల, హంద్రీ నుంచి డ్యాంకు 3.58లక్షల క్యూసెక్కులు ఇన్ఫ్లోగా వచ్చి చేరాయి. శ్రీశైలం పది గేట్ల ద్వారా సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. వరద వేగం పుంజుకోవడంతో గేట్ల ఎత్తును 14 అడుగులకు ఇంజనీర్లు పెంచారు.
విద్యుత్ సంబంధిత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలు జారీ చేశారు. భవనానికి విద్యుత్ సంబంధిత పనులన్నీ రేపటిలోగా అందుబాటులో ఉంటాయని అధికారులు తెలియజేశారు.
వైసీపీ కంచుకోటగా ఉన్న కడప గడ్డపై టీడీపీ జెండాను రెపరెపలాడించిన కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిపై ఎవరైనా నోరు జారితే సహించేది లేదని ఆ పార్టీ కార్పొరేటర్లు హెచ్చరించారు.
ఆంధ్రా ఊటీగా గుర్తింపు ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ అభివృద్ధి అటకెక్కినట్లే కనిపిస్తోంది. టూరిజం రంగాన్ని ఉరకలెత్తించి తద్వారా ఆదాయ మార్గాలను పెంచుకోవాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు జిల్లా ఉన్నతాధికారులు తమ వంతు ప్రయత్నాలను తీవ్రంగా చేశారు.
జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ను సస్పెండ్ చేస్తూ.. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దేవాదాయ శాఖ పరిధిలోని స్థలంలో విజయవాడ ఉత్సవ్ నిర్వహణపై దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టేసింది.
ఏపీలో వరల్డ్ క్లాస్ లైబ్రరీని ఏర్పాటు చేస్తామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. అన్ని లైబ్రరీలను అనుసంధానం చేస్తూ యాప్ను అభివృద్ధి చేస్తామని అన్నారు.
నేటి అసెంబ్లీ సమావేశాల్లో వ్యవసాయం రంగం, జీఎస్టీ సంస్కరణలు తదితర అంశాలపై చర్చ జరగనుంది.
ప్రపంచ సంపన్నుల జాబితాను ఏటా లెక్కలు కట్టి వెల్లడించే ‘ఫోర్బ్స్’ సంస్థ గనుక దేవుళ్లలోకెల్లా ధనవంతులెవరు? అని ఆరా తీసి అంచనా వేస్తే... నెంబర్ వన్ స్థానం బహుశా మన తిరుమల వెంకన్నకే దక్కుతుంది. వేంకటేశుని ధర్మకర్తల మండలి టీటీడీ వార్షిక బడ్జెట్టే రూ.5వేల కోట్లకు పైనే.