Amaravati Development: అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం
ABN , Publish Date - Dec 25 , 2025 | 08:37 PM
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. మంత్రి నారాయణ హైకోర్టు నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేషన్ పనులను ప్రారంభించారు.
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. మంత్రి నారాయణ హైకోర్టు నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేషన్ పనులను ప్రారంభించారు. బీ+జీ+7 అంతస్తుల్లో ఐకానిక్ భవనంగా హైకోర్టు నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం ఏడింటిని ఐకానిక్ భవనాలుగా నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. నార్మన్ ఫాస్టర్స్ అండ్ పార్ట్‌నర్స్ ఇచ్చిన డిజైన్‌తో హైకోర్టు నిర్మాణ పనులు చేపట్టినట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు.
మొత్తం 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 52 కోర్టు హాల్స్‌తో హై కోర్టు నిర్మాణం జరుగుతుందని తెలిపారు. 2,4,6 వ అంతస్తుల్లో కోర్టు హాళ్లు ఉంటాయని అన్నారు. 8వ అంతస్తుల్లో ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఉంటుందని, మొత్తం 45000 టన్నుల స్టీల్‌ను భవనానికి వాడుతున్నామని వెల్లడించారు. 2027 చివరికి హై కోర్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల అమరావతి పనులు ఆలస్యం అయ్యాయని అన్నారు.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్‌లో రిజెక్ట్.. సీన్ కట్ చేస్తే.. డబుల్ సెంచరీ చెలరేగాడు.. ఎవరంటే?
బంగ్లాదేశ్‌లో ఆగని అరాచకాలు.. మరో హిందువు దారుణ హత్య..