Home » ACB
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సస్పెన్షన్ వేటు పడిన డీఎస్పీ భీమ్‌రెడ్డికి మరో షాక్ తగిలింది. మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇచ్చింది. అతడిపై ఈసీఐఆర్ (ECIR) కేసును ఈడీ నమోదు చేసింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో డిప్యూటీ ఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మెండు లోకనాథం పెద్దఎత్తున అక్రమాస్తులు కూడబెట్టారు. పవిత్రమైన ప్రదేశంలో కీలకమైన స్థానంలో ఉండి భారీగా ఆస్తులు పోగేశారు.
టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ సోదాల విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీబీఐ ఇచ్చిన నివేదిక తర్వాతే... తిరుమల శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈఓ మేండు లోకనాథంపై అక్రమాస్తుల కేసు నమోదు చేసినట్లుగా ఏసీబీ అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లో మరోసారి ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూగర్భ గనుల శాఖ ఏడీ జయరాజు ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
అక్రమాస్తుల కేసులో ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డిని రంగారెడ్డి ఏసీబీ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు.
ఏసీబీ అధికారుల వలలో మరో ఉన్నతాధికారి చిక్కారు. భారీ అవినీతి, అక్రమాస్తుల ఆరోపణల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో ఎమ్మార్వోగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ రెడ్డి నివాసంలో గురువారం ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
హైదరాబాద్‌లో డీఎస్పీ భీమ్ రెడ్డి అక్రమాస్తుల కేసు కీలక మలుపు తిరిగింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న భీమ్ రెడ్డిని ఏసీబీ అధికారులు రెండు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
ఫార్ములా-ఈ రేస్ కేసు విచారణలో భాగంగా నాంపల్లి ఏసీబీ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ విచారణకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు హాజరయ్యారు.
పశ్చిమ బెంగాల్‌లో భారీగా అవినీతి సొమ్ము బయటపడింది. ఓ మాజీ బస్సు డ్రైవర్ ఇంట్లో బయటపడిన ఈ నగదును లెక్కించే క్రమంలో ఏకంగా 5 కౌంటింగ్ మెషీన్లు విఫలం కావడం విశేషం.
తెలంగాణలో అవినీతి నిర్మూలనపై అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30, 2026 వరకూ తెలంగాణ ఏసీబీ మొత్తం 10 ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులు, 34 ట్రాప్ కేసులు, 23 ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రికార్డు స్థాయిలో కేసులు నమోదు చేసింది.