ADE Ambedkar: ఏసీబీ కస్టడీకి ఏడీఈ అంబేడ్కర్.. పర్మిషన్ ఇచ్చిన కోర్టు..
ABN , Publish Date - Oct 05 , 2025 | 01:46 PM
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో విద్యుత్ శాఖ మాజీ ఏడీఈ అంబేడ్కర్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చంచల్‌గుడా జైలులో ఉన్నారు. అతడిని ప్రశ్నించేందుకు అవకాశం కల్పించాల్సిందిగా ఏసీబీ అధికారులు పిటిషన్ వేశారు.
హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో విద్యుత్ శాఖ మాజీ ఏడీఈ అంబేడ్కర్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చంచల్‌గుడా జైలులో ఉన్నారు. అతడిని ప్రశ్నించేందుకు అవకాశం కల్పించాల్సిందిగా ఏసీబీ అధికారులు పిటిషన్ వేశారు. పిటిషన్‌ను విచారించిన ఏసీబీ కోర్టు అందుకు అనుమతి ఇచ్చింది. నాలుగు రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది(ADE Ambedkar ACB questioning).
సోమవారం నుంచి నాలుగు రోజులపాటు అంబేడ్కర్‌ను ఏసీబీ అధికారులు విచారించబోతున్నారు (ACB court permission). సెప్టెంబర్ 16న అంబేడ్కర్ నివాసంతోపాటు కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. అంబేడ్కర్‌కు సంబంధించిన ప్లాట్లు, భవనాలు, భూములను అధికారులు గుర్తించారు. అంబేడ్కర్ ఆస్తులకు బహిరంగ మార్కెట్లో సుమారు రూ.200 కోట్లకు పైగా విలువ ఉన్నట్టు గుర్తించారు. ఇబ్రహీం బాగ్, నార్సింగి, మణికొండ ప్రాంతాలలో అంబేడ్కర్ విద్యుత్ శాఖ ఏఈ, ఏడీగా విధులు నిర్వర్తించారు.
నిందితుడికి సంబంధించిన వ్యక్తి ఇంట్లో రెండు కోట్ల రూపాయల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు (ADE Ambedkar news). ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టినట్టు తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. దీంతో అంబేద్కర్‌ను విధుల నుంచి విద్యుత్ శాఖ తొలగించింది. నాలుగు రోజుల కస్టడీలో ఆస్తులు, ఇతర అంశాలపై అంబేడ్కర్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భాగ్యనగరంలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: మంత్రి ప్రభాకర్
Read Latest TG News And Telugu News