Home » ABN
రెండోవిడత భూసేకరణ కోసం గ్రామాల్లో ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. డిసెంబర్ 5వ తేదీ తర్వాత రెండో విడత భూ సేకరణ ప్రారంభవుతోందని వివరించారు. భూసమీకరణలో అనుభవం ఉన్న అధికారులను నియమించాలని కలెక్టర్లను ఆదేశించామని పేర్కొన్నారు.
తెలంగాణాలో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రోజుకో రీతిలో ఎత్తుగడలు వేస్తూ సర్పంచ్ అభ్యర్థులు ప్రచారం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. భూపాలపల్లి జిల్లాలో వెలసిన ఓ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏమిటా పోస్టర్? అందులో ఏముందంటే.?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు ఈ నెల 23వ తేదీన జరగనున్నాయి. ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం ఎన్నికల నిర్వహణపై అప్సా అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన కార్యవర్గం బుధవారం సమావేశమైంది.
ఖరీదైన, ఫ్యాన్సీ నంబర్ ప్లేట్‌ను వేలంలో దక్కించుకున్న హరియాణా వ్యక్తి చిక్కుల్లో పడ్డాడు. ఆయన ఆదాయం, ఆస్తులపై దర్యాప్తు చేయాలని అక్కడి అధికారులు ఆదేశించారు. ఇక.. ఈ వీఐపీ నంబర్‌ను మరోసారి వేలంలో ప్రవేశపెడుతున్నట్టు రవాణా శాఖ పేర్కొంది. మరి ఈసారి ఆ ఫ్యాన్సీ నంబర్‌ను ఎవరు పొందుతారు? ఎంత ధర పలుకుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
అమెరికాలో 2017లో జరిగిన జంట హత్యల కేసులో ఇటీవల నిందితుణ్ని గుర్తించిన అధికారులు.. ఈ కేసు పురోగతిలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం.. నిందితుడు పరారీలో ఉండటంతో అతడిపై భారీ రివార్డ్ ప్రకటించారు.
కొత్తగూడెం రైల్వేస్టేషన్లో గురువారం బాంబు పేలింది. ఈ ఘటనలో కుక్క మరణించింది. ఈ పేలుడుపై జిల్లా ఎస్పీ స్పందించారు.
ఐ బొమ్మ రవిని తెలంగాణ పోలీసులు విచారించారు. ఈ విచారణలో పలు కీలక అంశాలు వెల్లడించారు. ఐ బొమ్మ మూసివేశాం.. తర్వాత ఏమిటంటూ అతడిని పోలీసులు ప్రశ్నించారు.
హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా గాంధీ భవన్ ముట్టడించేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించాయి.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దాదాపు వెయ్యి మందికిపైగా ప్రయాణికులు చిక్కుకుపోయారు. దాదాపు 12 గంటల పాటు వీరంతా ఎయిర్ పోర్టులోనే ఉండిపోయారు.
ఒక్క రోజు పళ్లు తోముకోకుంటే ఏముందిలే అని వదిలేస్తాం. కానీ అదే మన ప్రాణాలకు ముప్పు తీసుకు వస్తుందని ఏ మాత్రం గమనించం. ఒక్క రోజు కూడా పళ్లు తోముకోకపోవడం వల్ల మరణానికి చేరువ అవుతున్నామనే విషయాన్ని గుర్తించం.