Share News

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

ABN , Publish Date - Feb 18 , 2026 | 10:27 AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఐదో రోజు అంటే.. ఈ రోజు (బుధవారం) సభ ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాలతో సభ కార్యకలాపాలను స్పీకర్ సీహెచ్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

అమరావతి; ఫిబ్రవరి 18: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఐదో రోజు అంటే.. ఈ రోజు (బుధవారం) సభ ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాలతో సభ కార్యకలాపాలను స్పీకర్ సీహెచ్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. అంతకు ముందు ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఆడియో వ్యవస్థలో సాంకేతిక లోపం ఉందన్నారు. ఈ నేపథ్యంలో అందుకు ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఆడియో వ్యవస్థను బాగు చేసేందుకు సాంకేతిక నిపుణులు ముంబై నుంచి వస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. అనంతరం ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైంది. ప్రభుత్వాసుపత్రుల సామర్థ్యం పెంపుపై పలువురు సభ్యులు ప్రశ్నలు వేశారు. అందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ జవాబు ఇచ్చారు.


ఆళ్లగడ్డ, వాయల్పాడు, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వురు, నెల్లూరు జిల్లా కోవూరులలో 50 పడకల ఆసుపత్రిలను 100 పడకల ఆసుపత్రిగా మార్చాలంటూ ప్రభుత్వానికి టీడీపీ ఎమ్మెల్యే అఖిల ప్రియ విజ్ఞప్తి చేశారు. ఆళ్లగడ్డలో 50 పడకలు ఆసుపత్రిని కూటమి ఏర్పాటు చేసిందని.. దీనిని 100 పడకల ఆసుపత్రిగా మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే మాజీ ఎమ్మెల్యే, తన తల్లి శోభానాగిరెడ్డి యాక్సిడెంట్ జరిగిన తర్వాత.. ఆళ్లగడ్డ అనంతరం నంద్యాల.. అక్కడి నుంచి హైదరాబాద్‌కి షిప్ట్ చేసినప్పడు గోల్డన్ అవర్ కోల్పోవడం వల్లే ఆమె చనిపోయారని ఈ సందర్భంగా అఖిల ప్రియ గుర్తు చేసుకున్నారు. తన తండ్రి విషయంలోనూ అలాగే జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.


వివిధ ప్రమాదాల కారణంగా తమ ప్రాంతంలో లో చాలా మంది చనిపోతున్నారన్నారు. ఆళ్లగడ్డలో వైద్యులు లేరన్నారు. ఎక్సపర్ట్‌లు కూడా లేరని చెప్పారు. అందువల్ల నంద్యాల, కర్నూలుకు రిఫరల్ చేసిన కేసులు వేలలో ఉన్నాయని ఆమె వివరించారు. ఆళ్లగడ్డలో కనీసం ట్రామా సెంటర్ సైతం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే అఖిల ప్రియ కోరారు. దీనిపై మంత్రి సత్యకుమార్ స్పందించారు. ప్రభుత్వ ఆసుపత్రులో 50 నుంచి 100 పడకల సామర్థ్యానికి పెంచాలంటూ తమకు ప్రతిపాదనలు వచ్చాయన్నారు. అయితే ట్రామా సెంటర్లు విషయంలో ప్రతి 100 కిలోమీటర్లుకు ఒకటి ఏర్పాటు చేయాలంటూ ఇప్పటికే కేంద్రం ప్రకటన చేసిందని వివరించారు. ఇంతలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు జోక్యం చేసుకున్నారు. జాతీయ రహదారులపై క్రిటికల్ కేర్ బ్లాక్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు.


గుడివాడ నియోజకవర్గంలో ఎన్నో ఆరోగ్య కేంద్రాలు ప్రారంభమై.. గత ప్రభుత్వ హయాంలో సగంలో ఆగిపోయాయని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆవేదన వ్యక్తం చేశారు. రుద్రపాక ఆరోగ్య కేంద్రాన్ని వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రామాపురం ఆసుపత్రి పెచ్చులూడిపోయి.. దీన పరిస్థితిలో ఉందన్నారు. కవుతవరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇక గుడివాడలో 100 పడకల ఆసుపత్రి ఉందని.. అందులో డయాలసిస్ సెంటర్ సైతం ఏర్పాటుకు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

దీనిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. మోటూరు, కవుతవరం, రామాపురంలో ఆసుపత్రుల పనులు పూర్తి కోసం ఇప్పటికే టెండర్లు పిలిచామని పేర్కొన్నారు. కానీ ఎవరూ రాకపోవడంతో పనులు ఆలస్యం అవుతూందని చెప్పారు. వీలున్నంత తొందరలో ఈ పనులన్నింటిని పూర్తి చేస్తామని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏడు రకాల క్యాన్సర్లను గుర్తించే కిట్‌!

స్థూలకాయం, మధుమేహం ఈ శతాబ్దపు అతిపెద్ద ఆరోగ్య సవాల్‌

For More AP News And Telugu News

Updated Date - Feb 18 , 2026 | 10:46 AM