Share News

రీల్స్ పిచ్చి.. ప్రాణాల మీదకు తెస్తున్న వికృత చేష్టలు.. వీడియో వైరల్

ABN , Publish Date - Feb 18 , 2026 | 11:42 AM

సోషల్ మీడియా పాపులర్ కావాలనే పిచ్చితో యువత ప్రమాదకరమైన రీల్స్ చేస్తున్నారు. ఢిల్లీలోని ఉస్మాన్‌పూర్ ప్రాంతంలో ఒక యువకుడి వికృత చేష్టలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..

రీల్స్ పిచ్చి.. ప్రాణాల మీదకు తెస్తున్న వికృత చేష్టలు.. వీడియో వైరల్
Dangerous Reels Trend

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో ‘లైకులు’, ‘వ్యూస్’ కోసం కొంతమంది యువత చేస్తున్న వికృత చేష్టల వల్ల సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి ఘటనే ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఉస్మాన్‌పూర్ ప్రాంతంలో యువకుడి చేష్టలు అందరినీ షాక్‌కు గురిచేశాయి. కదిలే వాహనాల డోర్లు ఓపెన్ చేస్తూ.. అతడు చేసిన విన్యాసం ప్రాణాపాయాన్ని కొని తెచ్చేలా ఉంది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక యువకుడు వేగంగా బైక్ నడుపుతూ, రోడ్డుపై వెళుతున్న బస్సులు, ఆటోలు, కార్ల పక్కకు వెళ్తున్నాడు. బైక్ హ్యాండిల్‌ను ఒక చేత్తో పట్టుకొని, మరో చేత్తో పక్కన ఉన్న వాహనాల డోర్లను హఠాత్తుగా తెరిచి వెళ్తున్నాడు. ఈ దృశ్యాలను వెనక వస్తున్న మరో వ్యక్తి ఫోన్‌లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పోలీసులు అతనిపై మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్ 28 కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ వీడియోలను చూసి నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి విన్యాసాలతో ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగే ప్రమాదం ఉందని మండిపడుతున్నారు. ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.


ఈ వార్తలూ చదవండి:

వరుడిని చూడగానే ట్రాన్స్‌జెండర్‌లకు డౌట్! ఆ తరువాత..

ఫోన్‌లో మాట్లాడుతున్న మహిళ! ఇంతలో ఊహించని విధంగా..

Updated Date - Feb 18 , 2026 | 01:02 PM