Share News

క్యాతనపల్లిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నివాసం వద్ద మోహరించిన పోలీసులు

ABN , Publish Date - Feb 18 , 2026 | 08:36 AM

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. స్థానిక బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బాల్క సుమన్‌‌ను అరెస్టు చేస్తారన్న సమాచారం నేపథ్యంలో ఆయన నివాసానికి వందల సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు.

క్యాతనపల్లిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నివాసం వద్ద మోహరించిన పోలీసులు

మంచిర్యాల, ఫిబ్రవరి 18: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. స్థానిక బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బాల్క సుమన్‌‌ను అరెస్టు చేస్తారన్న సమాచారం నేపథ్యంలో ఆయన నివాసానికి వందల సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామికి వ్యతిరేకంగా కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మంగళవారం వాయిదా పడింది. ఆ క్రమంలో ఘర్షణలు చోటు చేసుకుని.. ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అలాంటి వేళ.. బుధవారం నాడు క్యాతనపల్లిలో బంద్‌కు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.


మంగళవారం నాడు పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతోపాటు ఎస్ఐ, కానిస్టేబుల్‌పై దాడి చేశారని దేవాపూర్ ఎస్ఎచ్‌వో గంగారాం ఫిర్యాదు చేశారు. దాంతో బాల్క సుమన్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేశారు. చెన్నూరులో బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ అనిల్‌ను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.


అసలు ఏం జరిగిందంటే..?

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో క్యాతనపల్లి మున్సిపాలిటీలోని మొత్తం 22 వార్డుల్లో.. బీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 7, సీపీఐ 4, స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. దీంతో హంగ్ ఏర్పడింది. బీఆర్ఎస్, సీపీఐ కూటమి మధ్య పొత్తు కుదిరి.. 14 మంది సభ్యులతో పాలకవర్గాన్ని కైవసం చేసుకోవడం ఖాయమైంది. ఇక మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ ఎక్స్ అఫీషియో సభ్యులుగా పేరు నమోదు చేసుకోవడంతోపాటు స్వతంత్ర అభ్యర్థిని సైతం కూడగట్టుకోవడంతో కాంగ్రెస్ బలం 10 స్థానాలకు పరిమితమైంది. సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత.. 10 నిమిషాలపాటు ఉన్నతాధికారులు విరామం ప్రకటించారు. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యుడు.. బీఆర్ఎస్ నేతల వద్దకు వెళ్లి మంతనాలు జరపడంతో అసలు గొడవకు దారితీసింది. అనంతరం చోటు చేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏడు రకాల క్యాన్సర్లను గుర్తించే కిట్‌!

స్థూలకాయం, మధుమేహం ఈ శతాబ్దపు అతిపెద్ద ఆరోగ్య సవాల్‌

For More TG News And Telugu News

Updated Date - Feb 18 , 2026 | 10:22 AM