Home » ABN
భారీగా బంగారు ఆభరణాలు ధరించి వైరల్ అయిన రాజస్థాన్ వాసి 'బప్పి లహిరి ఆఫ్ చిత్తోర్‌గఢ్'కు ఇటీవల గ్యాంగ్ స్టర్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అతడు.. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. అసలేమైందంటే...
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) సాకారానికి మరో ఏడాది సమయం పట్టేలా ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి 3ఏ ప్రతిపాదనల్లో పురోగతి నెలకొన్నా.. వివిధ దశలు పూర్తవడానికి దాదాపు సంవత్సరం పట్టే అవకాశముందని ఎన్‌హెచ్ అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పటికి గానీ ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు.
రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం గుట్టల్లో మాజీ నక్సలైట్ దారుణ హత్యకు గురయ్యాడు. హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ అంతకంతకూ వెనక్కు వెళ్తోంది. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి ఏపీ మెట్రోరైల్ కార్పొరేషన్(ఏపీఎంఆర్సీ) అన్ని అస్త్రాలను సిద్దం చేసుకోగా.. ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం అనుమతి రాకపోవడంతో పట్టాలెక్కడానికి ఆలస్యమవుతోంది. ఈ ప్రాజెక్టుకు టెండర్ల ప్రక్రియ పూర్తై టెక్నికల్ బిడ్‌లు తెరిచినా.. ఫైనాన్షియల్ బిడ్‌లను తెరిచి టెండర్లను ఖరారు చేయటానికి కేంద్రం అనుమతులు అవసరం. కానీ, అనుమతుల్లో జాప్యం కారణంగా భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విమాన ప్రయాణానికి సంబంధించిన అంశాలు ఈ మధ్య తరచూ వార్తలకెక్కుతూనే ఉన్నాయి. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు బయల్దేరిన విమానాన్ని.. దారి మళ్లించి మరలా ల్యాండ్ చేశారు. అలాగే గువహటి నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఫ్లైట్ ఒకటి రద్దైంది. దీంతో భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానం లభించింది. బియ్యం ఆధారిత వంటకాలపై ప్రసిద్ధి చెందిన టెస్ట్ అట్లస్ విడుదల చేసిన జాబితాలో 10వ స్థానం దక్కింది.
తెలుగు సినీ పరిశ్రమను పట్టిపీడిస్తున్న పైరసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మది రవినీ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు రెండోసారి కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
రెండు రోజులుగా మార్కెట్లలో భారీ పెరుగుదలను నమోదు చేసిన బంగారం ధరలు.. శుక్రవారం ఉదయం నాటికి కాస్త దిగొచ్చాయి. అటు వెండి రేట్లు మాత్రం భారీగా ఎగబాకాయి. మన దేశంలోని ఆయా ప్రముఖ ప్రాంతాల్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయంటే...
ఆర్థిక కార్యకలాపాలకు రాజధాని అమరావతి కేంద్ర బిందువుగా మారనుంది. శుక్రవారం ఆర్బీఐ సహా 15 బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేయనున్నారు.
మంగళగిరి పట్టణం శివాలయం సమీపంలో రూ. 1.72 కోట్లతో ఆధునీకరించిన మోడల్ పబ్లిక్ లైబ్రరీని మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. 1986లో ముఖ్యమంత్రి హోదాలో స్వర్గీయ ఎన్టీఆర్, మాజీ మంత్రి స్వర్గీయ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగు విజ్ఞాన సమాచార కేంద్రం పేరుతో మంగళగిరిలో లైబ్రరీకి ఆయన శంకుస్థాపన చేశారు.