టీమిండియా నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు దీటుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఓపెనర్ ఐదెన్ మార్క్రమ్ (110) భారత బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. 4 సిక్స్‌లు, 10 ఫోర్లతో సెంచరీ చేసి భారత బౌలర్ల గుండెల్లో గుబులు రేపాడు.
టెస్ట్, వన్డే సిరీస్ తర్వాత భారత్, దక్షిణాఫ్రికాలు టీ-20 ఫార్మాట్లో తలపడబోతున్నాయి. డిసెంబర్ 9వ తేదీ నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ-20 సిరీస్ ప్రారంభం కాబోతోంది. ఈ సిరీస్ కోసం సెలక్టర్లు తాజాగా టీమిండియా జట్టును ప్రకటించారు.
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ తాజాగా మరో సెంచరీ చేశాడు. రాయ్‌పూర్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో విరాట్ కోహ్లీ వరుసగా రెండో సెంచరీ చేశాడు. రాంచీలో జరిగిన తొలి మ్యాచ్‌లో 135 పరుగులు చేసిన కోహ్లీ.. అదే ఫామ్‌ను కొనసాగిస్తూ మరో శతకం బాదాడు.
గైక్వాడ్, కోహ్లీ చెలరేగడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. రాయ్‌పూర్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు టీమిండియా బ్యాటర్లు చుక్కలు చూపించారు.
కింగ్ విరాట్ కోహ్లీ మరోసారి తన విశ్వరూపం ప్రదర్శించాడు. వరుసగా రెండో సెంచరీ సాధించాడు. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ కూడా తొలి శతకంతో మెరిశాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు చెలరేగడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది.
రష్యన్ అథ్లెట్ సెర్గీ బోయ్ట్సోవ్ 5500 అడుగుల ఎత్తులో హాట్ ఎయిర్ బెలూన్ కింద ఏర్పాటు చేసిన మైదానంలో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడి ప్రపంచ రికార్డు సృష్టించాడు. సోషల్ మీడియాలో వీడియో 44 మిలియన్ వీక్షణలు దాటింది.
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ టాస్ ఓడింది. సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోగా టీమిండియా ముందుగా బ్యాటింగ్‌కు దిగనుంది.
భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుంటేనే ప్రత్యర్థి జట్లు సంతోషపడతాయని అఫ్గాన్ స్టార్ క్రికెటర్ గుర్బాజ్ పేర్కొన్నాడు. వన్డేలకు కూడా వారిద్దరూ రిటైర్ అయితేనే తాను సంతోషిస్తానని వెల్లడించాడు.
రాంచీ వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ లేకపోతే భారత్ ఓడిపోయేదని మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. యువ ఆటగాళ్లు కలిసి 200 పరుగులు కూడా చేయలేకపోయారని, టీమిండియాకు ఇప్పటికీ రో-కోనే ప్రధాన బలం అని విశ్లేషించాడు.
జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో టీమిండియా మహిళల కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. విరాట్, ధోనీ, సచిన్ విగ్రహాల సరసన స్థానం దక్కించుకున్న తొలి మహిళా క్రికెటర్‌గా హర్మన్ అరుదైన గౌరవం పొందనుంది.