మనమ్మాయిలే ‘రైజింగ్ స్టార్స్’
ABN , Publish Date - Feb 23 , 2026 | 04:48 AM
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నీని మళ్లీ భారత అమ్మాయిలే దక్కించుకున్నారు. తేజల్ హసబ్నిస్ (34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీకి తోడు...
రెండోసారి ఆసియా కప్ టీ20 టోర్నీ కైవసం
తేజల్ హాఫ్ సెంచరీ జూతిప్పేసిన ప్రేమ
46 పరుగులతో బంగ్లాదేశ్ చిత్తు
బ్యాంకాక్: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నీని మళ్లీ భారత అమ్మాయిలే దక్కించుకున్నారు. తేజల్ హసబ్నిస్ (34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీకి తోడు లెగ్ స్పిన్నర్ ప్రేమా రావత్ (3/12) తిప్పేసిన వేళ ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ ‘ఎ’ 46 పరుగులతో బంగ్లాదేశ్ ‘ఎ’ను చిత్తు చేసింది. తొలుత భారత్ ‘ఎ’ 20 ఓవర్లలో 134/7 స్కోరు చేసింది. కెప్టెన్ రాధా యాదవ్ (36), దినేశ్ వ్రింద (19) కీలక ఇన్నింగ్స్ ఆడారు. స్పిన్నర్ ఫహీమా ఖాతూన్ నాలుగు వికెట్లు పడగొట్టింది. ఛేదనలో భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ ‘ఎ’ 19.1 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. తనూజా కన్వర్, సోనియా మెంధియా చెరో రెండు వికెట్లు సాధించారు. తేజల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది.
44/4 నుంచి..: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఓ దశలో 44 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ దశలో తేజల్, రాధా యాదవ్ ఐదో వికెట్‌కు 89 పరుగులు జోడించడంతో భారత్ తేరుకుని పోరాడే స్కోరు చేసింది. ఆపై ఛేదనలో భారత బౌలర్ల విజృంభణకు బంగ్లాదేశ్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. 2023లో తొలిసారి నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లోనూ బంగ్లాదేశ్‌నే ఓడించిన భారత్ విజేతగా నిలవడం విశేషం.
సంక్షిప్త స్కోర్లు
భారత్ ‘ఎ’: 20 ఓవర్లలో 134/7 (తేజల్ హసబ్నిస్ 51 నాటౌట్, రాధా యాదవ్ 36, దినేశ్ వ్రింద 19, ఫహీమా ఖాతూన్ 4/25)
బంగ్లాదేశ్ ‘ఎ’: 19.1 ఓవర్లలో 88 ఆలౌట్ (షమీమా సుల్తానా 20, సర్మిన్ సుల్తానా 18, ఫహీమా ఖాటున్ 14, ప్రేమా రావత్ 3/12, తనూజా కన్వర్ 2/11, సోనియా 2/21).
ఇవి కూడా చదవండి:
సూపర్ 8: శ్రీలంకతో మ్యాచ్‌కు ముందే ఇంగ్లండ్‌కు గట్టి ఎదురు దెబ్బ
సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్‌కు గుడ్‍న్యూస్