Share News

వెస్టిండీస్ ఉగ్రరూపం.. వాంఖడేలో 254 పరుగులతో రికార్డు స్కోరు..

ABN , Publish Date - Feb 23 , 2026 | 09:38 PM

వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్ ఉగ్రరూపం ప్రదర్శించింది. జింబాబ్వే బౌలర్లకు ఊచకోత అంటే ఏంటో చూపించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 254 పరుగుల రికార్డు స్కోరు నమోదు చేసింది. టీ-20 ప్రపంచకప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో విండీస్, జింబాబ్వే మధ్య సూపర్-8 మ్యాచ్ జరిగింది.

వెస్టిండీస్ ఉగ్రరూపం.. వాంఖడేలో 254  పరుగులతో రికార్డు స్కోరు..
Zim vs WI 2026

వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్ ఉగ్రరూపం ప్రదర్శించింది. జింబాబ్వే బౌలర్లకు ఊచకోత అంటే ఏంటో చూపించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 254 పరుగుల రికార్డు స్కోరు నమోదు చేసింది. టీ-20 ప్రపంచకప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో విండీస్, జింబాబ్వే మధ్య సూపర్-8 మ్యాచ్ జరిగింది. విండీస్ బ్యాటర్ హెట్‌మయెర్ 34 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 85 పరుగులు చేశాడు. టీ-20 ప్రపంచకప్‌లో అత్యంత వేగవంతమైన అర్ధశతకం చేసిన ఆటగాడిగా నిలిచాడు (Zim vs WI 2026).


విండీస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు మినహా మిగతా బ్యాటర్లు అందరూ దూకుడుగానే ఆడారు. ఫోర్లు, సిక్స్‌లతో హోరెత్తించారు. టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేసిన జింబాబ్వే తర్వాత భారీగా పరుగులు సమర్పించింది. విండీస్ బ్యాటర్లు అందరూ కలిసి ఏకంగా 19 సిక్స్‌లు కొట్టారు. చివరి పది ఓవర్లలో ఏకంగా 139 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు (West Indies record score).


హెట్‌మయెర్‌తో పాటు పావెల్ (59) అర్ధశతకం సాధించాడు (West Indies 254 runs). చివర్లో షెపర్డ్ (21) వేగంగా పరుగులు చేశాడు. దీంతో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 254 పరుగుల రికార్డు స్కోరు నమోదు చేసింది. ఈ ప్రపంచకప్‌లో ఇదే అత్యధిక టీమ్ స్కోరు కావడం గమనార్హం. కాగా, ఓవరాల్‌గా చూసుకుంటే ఇది రెండో అత్యధిక భారీ స్కోరుగా నిలిచింది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన జింబాబ్వే 3 ఓవర్లలో 25 పరుగులకే మూడు వికెట్లు పోగొట్టుకుంది.


ఇవి కూడా చదవండి..

పాపం.. స్నేహితుడికి సాయం చేయాలనుకున్నాడు.. రూ.7 కోట్ల స్కామ్‌లో ఇరుక్కున్నాడు..


మీది హెచ్‌డీ చూపు అయితే.. ఈ ఫొటోలోని రెండో పిల్లి ఎక్కడుందో 7 సెకెన్లలో గుర్తించండి..

Updated Date - Feb 23 , 2026 | 09:38 PM