వినాయక నవరాత్రుల్లో భాగంగా అమెరికా బే ఏరియాలోని సత్యనారాయణస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 'హృదయ నాదం' పేరుతో సంగీత విభావరిని ఘనంగా నిర్వహించారు. సంగీతం పై అనేక ప్రయోగాలు చేసిన ప్రముఖ సంగీతకారుడు వీణాపాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బహ్రెయిన్‌లో ఫుడ్ ప్యాకెట్లపై గడువు తేదీలను మార్చిన నేరంపై తెలుగువారితో సహా 12 మంది ప్రవాసీయులకు రెండేళ్ల జైలు శిక్ష పడింది. అలాగే దేశ బహిష్కరణ శిక్ష కూడా ఎదురైంది. ఆహార భద్రతా ప్రమాణాలను గల్ఫ్ దేశాలన్ని ఖచ్చితంగా పాటిస్తూ ప్రజారోగ్యానికి పెద్ద పీఠ వేస్తాయి. అయినా కొందరు వ్యాపారస్థులు అక్రమాలకు పాల్పడుతుంటారు.
శుక్రవారం లండన్‌లోని ఓ భారతీయ రెస్టారెంట్‌కు కొందరు దుండగులు నిప్పు పెట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పోలీసులు ఇప్పటికే ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
అమెరికన్ల ఉపాధి అవకాశాలు పెంచుతానంటున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ విదేశీ విద్యార్థుల ఓపీటీ ప్రోగ్రామ్‌పై కన్నేసింది. ఈ ప్రోగ్రామ్‌ను రద్దు చేయడం, పరిమితులు విధించడం, జీతాలపై పన్నులు తదితర అంశాలపై ట్రంప్ సర్కార్ దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.
న్యూయార్క్‌లో ఇటీవల టూరిస్టు బస్సు బోల్తా పడిన ఘటనలో ఓ భారతీయుడు కూడా మరణించినట్టు అధికారులు తాజాగా గుర్తించారు. మృతుల వివరాలను వెల్లడించారు.
TANA Flag Hoisted On Mount Elbrus: అమెరికాలో మొట్టమొదటిసారిగా వాల్మీకి రామాయణం తెలుగులో బోధించడానికి తానా సన్నాహాలను పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ పతాకాన్ని ఎగురవేశారు. తానా శ్రీకారం చుట్టిన గొప్ప కార్యక్రమం అందరి దృష్టిలో పడేలా చేశారు.
ట్రంప్ సర్కారు కఠిన వైఖరి కారణంగా అమెరికాలోకి వలసలు భారీగా తగ్గాయని ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన అధ్యయనంలో తాజాగా వెల్లడైంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో వలసలు ఏకంగా 1.5 మిలియన్ల మేర తగ్గినట్టు సంస్థ అధ్యయనంలో తేలింది. ఫలితంగా జనాభాలో వలసదారుల వాటా 15.8 శాతం నుంచి 15.4 శాతానికి పడిపోయింది.
ఛార్లెట్‌లో తానా చేపట్టిన బ్యాక్ ప్యాక్ కార్యక్రమం విజయవంతమైంది. హార్నెట్ నెస్ట్ ఎలిమెంటరీ స్కూల్లోని పేద పిల్లలకు ఈ కార్యక్రమం కింద దాదాపు 300కు పైగా బ్యాగ్‌లను అందజేశారు.
అమెరికాలోని న్యూయార్క్‌లో ఓ టూరిస్టు బస్సు అదుపు తప్పి పల్టీ కొట్టడంతో ఐదుగురు దుర్మరణం చెందారు. ప్రమాద సమయంలో బస్సులో భారతీయులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి సంయుక్త ఆధ్వర్యంలో హ్యూస్టన్‌లో 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు వైభవంగా జరిగింది. ఈ సదస్సులో భారత దేశం నుంచి 15 మంది ప్రముఖ సాహితీవేత్తలు, అమెరికాలో పలు నగరాల నుండి 75 మందికి పైగా విచ్చేశారు. 28 విభిన్న వేదికల్లో సుమారు 250 మంది ఆహూతుల సమక్షంలో తెలుగు భాషాసాహిత్య సౌరభాలను పంచుకున్నారు.