Share News

TAGB: టీఏజీబీ ఆధ్వర్యంలో వైభవంగా ‘దసరా-దీపావళి ధమాకా’

ABN , Publish Date - Oct 17 , 2025 | 11:21 PM

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్ (టీఏజీబీ) ఆధ్వర్యంలో అక్టోబర్ 11న స్థానిక లిటిల్‌టన్ హైస్కూల్‌లో దసరా–దీపావళి ధమాకా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. భారతీయ కాన్సుల్ జనరల్‌గా నియమితులైన ఎస్. రఘురాంను టీఏజీబీ సభ్యులు ఈ కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. పలువురు సమాజసేవకులను కూడా సన్మానించారు.

TAGB: టీఏజీబీ ఆధ్వర్యంలో వైభవంగా ‘దసరా-దీపావళి ధమాకా’
Telugu Association of Greater Boston

ఇంటర్నెట్ డెస్క్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్ (TAGB) ఆధ్వర్యంలో అక్టోబర్ 11న స్థానిక లిటిల్‌టన్ హైస్కూల్‌లో దసరా–దీపావళి ధమాకా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. బోస్టన్‌లో తొలి భారతీయ కాన్సుల్ జనరల్‌గా నియమితులైన ఎస్. రఘురాంను టీఏజీబీ (TAGB) సభ్యులు ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గొంది మాట్లాడుతూ తెలుగు భాష, సంస్కృతులపై మమకారం ఉన్న ఎస్. రఘురాం బోస్టన్‌లో భారతదేశ ప్రతినిధిగా నియమితులవడం తెలుగు వారికి గౌరవకారణమని వ్యాఖ్యానించారు. ఇక సమాజ సేవలో ముందుండే పలువురు ప్రముఖులను కూడా టీఏజీబీ సభ్యులు ఈ కార్యక్రమంలో భాగంగా ఘనంగా సన్మానించారు. తమ సేవలతో కమ్యూనిటీకి ఆదర్శంగా నిలిచిన టీం ఐడ్ వ్యవస్థాపకులు మోహన్ నన్నపనేని, బోస్టన్ ప్రాంత ప్రముఖులు, సమాజసేవకులు రమేష్ బాపనపల్లిని కూడా ఈ సందర్భంగా సత్కరించారు.

4.jpg


ప్రెసిడెంట్ శ్రీనివాస్ గొంది నాయకత్వంలో, ప్రెసిడెంట్ ఎలక్ట్ సుధా ముల్పూర్, కార్యదర్శి దీప్తి కొరిపల్లి, కొశాధికారి జగదీశ్ చిన్నం, కల్చరల్ సెక్రెటరీ సుర్య తెలప్రోలు సమన్వయంతో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సంగీతం, నృత్యం, వినోదం సమ్మిళితమైన ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. సాంస్కృతిక విభాగం సక్రమంగా ప్లాన్ చేసిన ఈ కార్యక్రమాలు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాయి.

1.jpg5.jpg3.jpg2.jpg10.jpg9.jpg6.jpg7.jpg8.jpg


ఇవి కూడా చదవండి:

నెల నెలా తెలుగు వెన్నెల 219 వ సాహిత్య సదస్సుకు ఆహ్వానం

ఖతర్ తెలుగు ప్రవాసీ ఎన్నికలలో అనూహ్య తీర్పు..

Read Latest and NRI News

Updated Date - Oct 17 , 2025 | 11:30 PM