Share News

219th Nela Nela Telugu Vennela: నెల నెలా తెలుగు వెన్నెల 219 వ సాహిత్య సదస్సుకు ఆహ్వానం

ABN , Publish Date - Oct 14 , 2025 | 09:44 PM

అక్టోబర్ 29వ తేదీ ఆదివారం నాడు ‘తెలుగు వనంలో గజల్ పరిమళం’ పేరిట సదస్సు జరగనుంది. కొరుప్రోలు మాధవరావు, విజయలక్ష్మి కందిబండ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పాకలపాటి వేణు గోపాల కృష్ణంరాజు తన మధుర గానంతో కార్యక్రమానికి వచ్చిన వారిని అలరించనున్నారు.

219th Nela Nela Telugu Vennela: నెల నెలా తెలుగు వెన్నెల 219 వ సాహిత్య సదస్సుకు ఆహ్వానం
219th Nela Nela Telugu Vennela

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రతి నెలా ‘నెల నెలా తెలుగు వెన్నెల’ సాహిత్య సదస్సును నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో మంది సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు, కార్యకర్తలు, పోషక దాతలు ఇచ్చిన స్ఫూర్తితో మన భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణ ప్రధాన ధ్యేయంగా మొదలు పెట్టిన ఈ సాహిత్య సదస్సు, దిన దినాభివృద్ధి చెందుతూ, సాహిత్య శోభ ను వెదజల్లుతూ, భావితరానికి స్పూర్తిదాయకమై, నిరాటంకంగా కొనసాగుతున్న “నెల నెలా తెలుగు వెన్నెల” సాహిత్య సదస్సు 219వ మైలు రాయిని చేరుకుంది.


అక్టోబర్ 29వ తేదీ ఆదివారం నాడు ‘తెలుగు వనంలో గజల్ పరిమళం’ పేరిట సదస్సు జరగనుంది. కొరుప్రోలు మాధవరావు, విజయలక్ష్మి కందిబండ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పాకలపాటి వేణు గోపాల కృష్ణంరాజు తన మధుర గానంతో కార్యక్రమానికి వచ్చిన వారిని అలరించనున్నారు. ‘ఈ అపూర్వ కార్యక్రమానికి మీరు విచ్చేసి, సాహిత్యపు మాధుర్యాన్ని ఆస్వాదించి, చరిత్ర లో లిఖించదగిన అద్వితీయమైన ఘట్టంలో భాగం కావలసిందిగా కోరుతున్నాము’ అంటూ ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సాహితీ ప్రియులకు ఆహ్వానం పలికింది.

WhatsApp Image 2025-10-14 at 9.25.27 PM.jpeg


ఇవి కూడా చదవండి

మీ పరిశీలనకు పరీక్ష.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 50 సెకెన్లలో కనిపెట్టండి

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విద్యార్థుల రక్షణకు కమిటీ నియామకం

Updated Date - Oct 14 , 2025 | 09:49 PM