NRI: అమెరికా సాహితీ సంస్థల ఆధ్వర్యంలో తెలుగు సాహితీవేత్తలకు జీవన సాఫల్య పురస్కారాలు
ABN , Publish Date - Oct 18 , 2025 | 10:47 PM
అమెరికా సాహితీ సంస్థలు అర్చన ఫైన్ ఆర్ట్స్, శ్రీ శారద సత్యనారాయణ ట్రస్ట్ (హ్యూస్టన్) సంయుక్తంగా దీపావళి పండుగను పురస్కరించుకుని తెలుగు సాహిత్యంలో తమదైన మృద్రవేసిన మహనీయులకు సాహిత్యభారతి జీవన సాఫల్య పురస్కారాలను అందజేశాయి.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా సాహితీ సంస్థలు అర్చన ఫైన్ ఆర్ట్స్, శ్రీ శారద సత్యనారాయణ ట్రస్ట్ (హ్యూస్టన్) సంయుక్తంగా దీపావళి పండుగను పురస్కరించుకుని తెలుగు సాహిత్యంలో తమదైన మృద్రవేసిన మహనీయులకు సాహిత్యభారతి జీవన సాఫల్య పురస్కారాలను అందజేశాయి. సాహిత్య సంస్థల వ్యవస్థాపకులు 'నాట్యభారతి' కోసూరి ఉమాభారతి, ప్రమీల సూర్యదేవర..ఈ అవార్డులను ప్రదానం చేశారు.
సంగీత, సాహిత్య, నాటక రంగాలలో బహుముఖ ప్రజ్ఞా ధురీణులు రామాయణం ప్రసాద రావు, కథా చైతన్య స్రవంతిగా తన కథల ద్వారా మనుషుల్లో చైతన్యాన్ని నింపిన డి.కామేశ్వరి, కథలు, కవితలు, చిత్రాలతో సృజనాత్మక లోకానికి మరింత అందంగా సొబగులద్దిన మన్నెం శారద, బహుముఖ ప్రజ్ఞాధురీణులు, దూరదర్శన్ వ్యాఖ్యాతగా అందరి హృదయాలలో నిలిచిన ఓలేటి పార్వతీశం ఈ పురస్కారాలను అందుకున్నారు. తమ సంస్థల తరఫున ఈ సాహిత్యభారతి జీవన సాఫల్య పురస్కారాలతో మహనీయులను సత్కరించినందుకు చాలా సంతోషంగా ఉందని నిర్వాహకులు కోసూరి ఉమాభారతి, ప్రమీల సూర్యదేవర పత్రికా ప్రకటనలో తెలియజేశారు.

హైదరాబాదులో జ్యోతి వలబోజు నేతృత్వంలో అకాడమీ తరఫున రచయిత్రుల బృందం పురస్కార గ్రహీతల స్వగృహాలలోనే వారిని గౌరవప్రదంగా సత్కరించి అవార్డులను అందుజేశారు. సాహిత్య కళారంగాలలో పలువురు ప్రముఖులు ఈ పురస్కార ప్రదానంపై తమ హర్షం వ్యక్తం చేశారు. పురస్కార గ్రహీతలను, నిర్వాహకులను అభినందించారు.


ఇవి కూడా చదవండి:
నెల నెలా తెలుగు వెన్నెల 219 వ సాహిత్య సదస్సుకు ఆహ్వానం
ఖతర్ తెలుగు ప్రవాసీ ఎన్నికలలో అనూహ్య తీర్పు..