Share News

Palaka Balapam Telugu Event: అట్లాంటాలో పలకబలపంతో తానా పాఠశాల తరగతులు ప్రారంభం

ABN , Publish Date - Oct 14 , 2025 | 09:01 PM

పాఠశాల 2025 - 26 నూతన విద్యా సంవత్సరం అట్లాంటాలో ‘‘పలక బలపం’’ కార్యక్రమంతో విజయవంతంగా ప్రారంభమైంది. గురువుల పరిచయాలతో.. తల్లిదండ్రులు, విద్యార్థులతో ప్రత్యక్ష సంభాషణలతో కార్యక్రమం ఆత్మీయంగా సాగింది.

Palaka Balapam Telugu Event:  అట్లాంటాలో పలకబలపంతో తానా పాఠశాల తరగతులు ప్రారంభం
Palaka Balapam Telugu Event

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ‘పాఠశాల’ పేరుతో అమెరికాలోని తెలుగు చిన్నారులకు తెలుగు భాషను నేర్పిస్తున్న సంగతి తెలిసిందే. పాఠశాల 2025 - 26 నూతన విద్యా సంవత్సరం అట్లాంటాలో ‘‘పలక బలపం’’ కార్యక్రమంతో విజయవంతంగా ప్రారంభమైంది. గురువుల పరిచయాలతో.. తల్లిదండ్రులు, విద్యార్థులతో ప్రత్యక్ష సంభాషణలతో కార్యక్రమం ఆత్మీయంగా సాగింది. తెలుగు భాష, సంస్కృతిని తదుపరి తరాలకు నేర్పించాలన్న లక్ష్యంతో పాఠశాలను ఏర్పాటు చేసినట్లు తానా ప్రతినిధులు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల విజయవంతంగా కొనసాగడానికి కృషి చేస్తున్న టీచర్లకు, వలంటీర్లకు వారు అభినందనలు తెలియజేశారు.

NRI-1.jpg


పిల్లల నిరంతర అభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా డిజిటల్‌ రైటింగ్‌ బోర్డులు బహుమతిగా అందజేశారు. తెలుగు ఆటలతో కార్యక్రమం ముగిసింది. ఈ వేడుక కొత్త విద్యా సంవత్సరానికి మంచి శుభారంభంగా నిలిచింది. ఈ కార్యక్రమం ప్రణాళిక, అమలు పనులను పాఠశాల ప్రాంతీయ ప్రతినిధి సునీల్‌ దేవరపల్లి, తానా ప్రాంతీయ ప్రతినిధి శేఖర్‌ కొల్లు నిర్వహించారు. అట్లాంటా పాఠశాల టీచర్‌ వాణి పలనాటి సేవలను ప్రస్తుతించారు. తానా మాజీ అధ్యక్షులు అంజయ్య చౌదరి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తర్వాత తానా నాయకులు విద్యార్థులను అభినందిస్తూ ప్రసంగించి, చివరన వాణిని శాలువాతో సత్కరించారు.

NRI-2.jpg


తానా అధ్యక్షుడు డా. నరేన్‌ కొడాలి, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌ లావు, మాజీ అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, భరత్‌ మద్దినేని - బోర్డు డైరెక్టర్‌, మధుకర్‌ యార్లగడ్డ - ఫౌండేషన్‌ ట్రస్టీ, సోహ్నీ అయినాలా - మహిళా సేవల సమన్వయకర్త, సునీల్‌ దేవరపల్లి - పాఠశాల ప్రాంతీయ ప్రతినిది, సోషియల్‌ వెల్పేర్‌ కో ఆర్డినేటర్‌, శేఖర్‌ కొల్లు తానా ప్రాంతీయ ప్రతినిధి (సౌత్‌ ఈస్ట్‌), అట్లాంటా పాఠశాల టీచర్లు అర్థిక అన్నే,పూలాని జాస్తి, వాణి పల్నాటితోపాటు, రాజేష్‌ జంపాల, అనిల్‌ యలమంచిలి, ఉప్పు శ్రీనివాస్‌, మురళి బొడ్డు, మాలతి నాగభైరవ, వినయ్‌ మద్దినేని, కోటేశ్వరరావు కందిమళ్ల, నరేన్‌ నల్లూరి, యశ్వంత్‌ జొన్నలగడ్డ, సునీత పొట్నూరు, సురేష్‌ బండారు, కృష్ణ ఇనపకుతిక తదితరులు పాఠశాల విద్యార్థులకు, టీచర్లకు, తల్లితండ్రులకు అభినందనలు తెలియజేశారు.

NRI-3.jpg


ఇవి కూడా చదవండి

యువకుడి బుద్ధిలేని పని.. ఏనుగు తోక పట్టుకుని..

ఎన్నికల వేళ బీజేపీలో చేరిన ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్

Updated Date - Oct 14 , 2025 | 09:04 PM