Man Pulls Elephants Tail: యువకుడి బుద్ధిలేని పని.. ఏనుగు తోక పట్టుకుని..
ABN , Publish Date - Oct 14 , 2025 | 08:38 PM
యువకుడు సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత ఏనుగు తోకను ఠక్కున పట్టుకున్నాడు. తర్వాత దాన్ని అటు, ఇటు గట్టిగా ఊపాడు.
ఓ యువకుడు సరదా కోసం ఏనుగుతో ఆటలాడాడు. దాని తోక పట్టుకుని రచ్చ రచ్చ చేశాడు. అంతటితో ఆగకుండా దాని మీద రాళ్లు సైతం రువ్వాడు. ఈ సంఘటన వెస్ట్ బెంగాల్‌లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. రెండు ఏనుగులు చెట్ల మధ్య నిల్చుని ఉన్నాయి. ఓ ఏనుగు తోక దగ్గర ఓ యువకుడు నిలబడి ఉన్నాడు. అతడు ఏనుగు తోకను పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఏనుగు ఆ తోకను అటు, ఇటు తిప్పుతూ ఉంది. యువకుడు సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత ఏనుగు తోకను ఠక్కున పట్టుకున్నాడు. తర్వాత దాన్ని అటు, ఇటు గట్టిగా ఊపాడు. ఏనుగు వెంటనే వెనక్కు తిరిగింది. యువకుడు పరుగున అక్కడినుంచి దూరంగా వచ్చేశాడు. ఏనుగు ఆ యువకుడితో పాటు పదుల సంఖ్యలో ఉన్న జనాలను చూసింది. కొద్దిగా భయపడిపోయింది. చెట్ల చాటున దాక్కుంది.
అక్కడున్న జనం వాటిపై రాళ్లు కూడా వేశారు. ఆ ఏనుగులు ఇబ్బందిపడుతూ ఉంటే నవ్వుతూ, కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేశారు. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఇప్పుడు చెప్పండి? నిజమైన అడవి జంతువులు ఎవరో’..‘ ఆ ఏనుగు దాడిలో ఆ యువకుడి చనిపోయినా కూడా నేను బాధపడను. ఎందుకంటే.. అది న్యాయమే కాబట్టి’..‘ఫారెస్ట్ ఆఫీసర్లు ఎక్కడికెళ్లారు. ఏనుగుల్ని ఇబ్బంది పెట్టిన వాళ్లను ఊరికే వదిలేయకూడదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
బాబా వాంగ జ్యోస్యం.. 2026లో జరగబోయేది ఇదే..
సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు ఇంట్రస్టింగ్ పోస్ట్