Baba Vanga Predicts: బాబా వాంగ జ్యోస్యం.. 2026లో జరగబోయేది ఇదే..
ABN , Publish Date - Oct 14 , 2025 | 06:46 PM
బాబా వాంగ జ్యోస్యం ప్రకారం వచ్చే ఏడాది.. అంటే 2026 సంవత్సరం ఇంత కంటే దారుణంగా ఉంటుందట. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుందని ఆమె చెప్పారు.
వరల్డ్ ఫేమస్ కాలజ్ఞాని బాబా వాంగ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె జ్యోస్యంపై ప్రపంచ జనాలకు చాలా నమ్మకం ఉంది. బాబా వాంగ చనిపోయి పాతికేళ్లు పైనే అవుతున్నా.. బతికున్న సమయంలో ఆమె చెప్పిన జ్యోస్యాలు చాలా వరకు నిజం అవుతూ వస్తున్నాయి. ఆమె చెప్పినట్లుగానే 2025లో ప్రపంచ వ్యాప్తంగా పెను విషాదాలు చోటుచేసుకున్నాయి. యుద్ధాలు, ప్రకృతి విషాదాలతోటే రోజులన్నీ గడిచిపోతున్నాయి.
ఓ బ్రిటీష్ మీడియా బాబా వాంగ జ్యోస్యం గురించి ఓ కథనం రాసింది. ఆ కథనం ప్రకారం.. 2026 సంవత్సరం ఇంత కంటే దారుణంగా ఉంటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుంది. గ్లోబల్ మార్కెట్ దెబ్బ తింటుంది. ఆర్థిక మాంద్యం వస్తుంది. ఫిజికల్, డిజిటల్ కరెన్సీ పతనం అవుతుంది. ఒక వేళ బాబా వాంగ జ్యోష్యం నిజమైతే ప్రపంచ దేశాలు ముందెన్నడూ లేని విధంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఆర్థిక మాంద్యం, ఎనర్జీ క్రైసిస్, ఆర్థిక విధానాలలో అస్థిరతలతో ఇబ్బందిపడుతున్న దేశాలపై తీవ్ర ప్రభావం పడనుంది. అయితే, కొంతమంది ఆర్థిక వేత్తలు బాబా వాంగ జ్యోస్యాన్ని కొట్టిపారేస్తున్నారు. అదంతా సూడో సైన్స్ అంటున్నారు. కాగా, బాబా వాంగ మూడో ప్రపంచ యుద్ధంపై కూడా జ్యోస్యం చెప్పారు. 2026లో ప్రపంచ దేశాల మధ్య యుద్ధం జరుగుతుందని అన్నారు. చాలా మంది అది మూడో ప్రపంచ యుద్ధం అని భావిస్తున్నారు. రష్యా, అమెరికా.. చైనా, తైవాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందని అనుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు ఇంట్రస్టింగ్ పోస్ట్
భాగ్యనగరంలో మరో బడా మోసం.. .. రుణం పేరిట కుచ్చుటోపీ