తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా (TSN) ఆధ్వర్యంలో గత శనివారం నిర్వహించిన తెలుగు బడి 2025–26 విద్యాసంవత్సర ప్రారంభోత్సవ సభ విశేష విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమానికి 150 మందికి పైగా హాజరై, తెలుగు భాషపై తమకున్న అభిమానం, మమకారాన్ని చాటుకున్నారు.
తానా బ్యాక్ ప్యాక్ కార్యక్రమంలో భాగంగా న్యూఇంగ్లాండ్లోని ఫ్రాంక్లిన్లోగల ఆరు పాఠశాలల్లో విద్యార్థులకు 200 పైగా బ్యాక్ ప్యాక్‌లను అందజేశారు.
అమెరికాలో నడి వీధిలో కత్తితో గట్కా ప్రదర్శన చేస్తున్న ఓ సిక్కు మతస్థుడిని లాస్ ఏంజెలెస్ పోలీసులు కాల్చి చంపారు. ప్రస్తుతం ఇది అమెరికాలో సంచలనం రేకెత్తిస్తోంది.
కర్నూలు జిల్లా బాలభారతి పాఠశాలకు ₹10 లక్షల విరాళాన్ని తానా బోర్డ్ ఆఫ్ డైరక్టర్ రవి పొట్లూరి అందించారు. శుక్రవారం ఆగస్టు 29 నాడు బాలభారతి పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో కర్నూలు రేంజి డిఐజి డాక్టర్ ప్రవీణ్ కోయా ₹10 లక్షల రూపాయల చెక్కును పాఠశాల వ్యవస్థాపకురాలు విజయభారతికి అందజేశారు.
ప్రవాస భారతీయుల తల్లిదండ్రుల సమక్షంలో వ్యవహారిక తెలుగు భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తికి ఘన నివాళి అర్పించారు. ఈ నేలపై తెలుగు భాషను సుసంపన్నం చేసిన మహనీయుడు గిడుగు వెంకట రామమూర్తి అని వక్తలు కొనియాడారు.
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఫీనిక్స్, అరిజోనాలోని మెసా కన్వెన్షన్ సెంటర్లో వైభవోపేతమైన ‘ఆటా డే’ కార్యక్రమం చేపట్టింది. ఫ్యాషన్ షో, పిల్లల పోటీలు, ఫుడ్ ఫెస్టివల్ ఒక గొప్ప మెమొరీగా నిలిచాయి.
అమెరికాలోని ఎన్నారైలు భారత్ తరపున అగ్రరాజ్యంలో తమ గొంతు వినిపించడంలో విఫలమయ్యారని ఎయిర్ఫోర్డ్ రిటైర్డ్ అధికారి ఒకరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
సౌదీ అరేబియాలో ఒక హైదరాబాదీ మహిళ దారుణానికి పాల్పడింది. తన ముగ్గురు చిన్నారులను చంపి తాను కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. సౌదీ అరేబియాలోని అల్ ఖోబర్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సిడ్నీ నగరంలో తెలుగు సంస్థల ఆధ్వర్యంలో అష్టావధాన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్ట్రాత్ ఫీల్డ్ కౌన్సిల్ పురపాలకమండలి సభ్యులు సంధ్యారెడ్డి.. అవధాని తటవర్తి కళ్యాణ చక్రవర్తిని, సంచాలకులను, నిర్వాహక సంస్థలను అభినందించారు.
వాల్‌మార్ట్‌లో ఇటీవల కొందరు అసోసియేట్స్ తొలగింపునకు, హెచ్-1బీ వీసా దుర్వినియోగానికి ఎలాంటి సంబంధం లేదని సంస్థ తాజాగా పేర్కొంది. విదేశీ వర్కర్ల నియామకానికి ప్రతిగా డబ్బులు చేతులు మారాయని సోషల్ మీడియాలో ఆరోపణలు రావడంతో సంస్థ ఈ మేరకు స్పందించింది.