ఆర్థికశాస్త్రంలో నిపుణులైన మన్మోహన్‌ను ప్రభుత్వాధిపతిగా సోనియాగాంధీ ఎన్నుకున్నారని, ఆశా వర్కర్ల స్కీమ్ వంటి పలు సంక్షేమ చర్యల్లో ఆమె నాయకత్వ శైలి కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని డీకే శివకుమార్ పేర్కొన్నారు.
తమిళనాడు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే శాంతి భద్రతలు వైఫల్యం, అవినీతి, అవకతవకల్లో కూరుకుపోయిందని, అయితే ముఖ్యమంత్రి నుంచి సీనియర్ మంత్రులందరూ ఇలాంటి వినోదాల్లో తేలుతుండటం సిగ్గుచేటని బీజేపీ విమర్శించింది.
శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్టగాలి జీవోత్తం మఠం తొలి సారస్వత బ్రాహ్మిణ్ వైష్ణణ మఠమని పీఎంఓ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ గోవాలోని పార్టగాలిలో మఠం ప్రధాన కార్యాలయం ఉంది.
దిత్వా తుపాను కారణంగా శ్రీలంకలో భారీ ప్రాణనష్టం జరగడంపై ప్రధానమంత్రి మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలు త్వరత గతిన కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్టు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు.
సీఎం పోస్టుపై కాంగ్రెస్ అధిష్ఠానం ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తుండగా, డీకే మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుందన కర్ణాటక రైతుల సమస్యలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తెచ్చేందుకు ఢిల్లీ వెళ్తానని చెప్పారు.
ఉడిపి రావడం తనకు ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తున్నానని మోదీ అన్నారు. జన్‌సంఘ్‌కు ఇది కర్మభూమి అని, బీజేపీ సుపరిపాలనా మోడల్‌కు ప్రేరణ అని చెప్పారు. 1968లో ఇక్కడి మున్సిపల్ కౌన్సిల్‌కు జన్‌సంఘ్ నేత వీఎస్ ఆచార్యను ఎన్నుకున్నారని గుర్తుచేశారు.
చవక.. చవక.. క్యాబ్ కంటే ఫ్లైట్ ప్రయాణం చవక.. అంటూ నెటిజన్లు పండుగ చేసుకుంటున్నారు. అయితే, ఇదే సమయంలో అర్బన్ కమ్యూటింగ్ లగ్జరీగా మారిపోతోందని కొందరంటుంటే, భారతదేశంలో ట్రాన్స్‌పోర్టేషన్ ధరల మధ్య తీవ్ర తేడాల్ని హైలైట్ చేస్తున్నారు.
ప్రజల ఆరోగ్యం గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కోరారు. ఢిల్లీ కాలుష్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. మన పిల్లలకు స్వచ్ఛమైన గాలి అవసరమని.. ఢిల్లీ కాలుష్యంపై విమర్శలు చేయకుండా వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
విమాన ప్రయాణానికి సంబంధించిన అంశాలు ఈ మధ్య తరచూ వార్తలకెక్కుతూనే ఉన్నాయి. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు బయల్దేరిన విమానాన్ని.. దారి మళ్లించి మరలా ల్యాండ్ చేశారు. అలాగే గువహటి నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఫ్లైట్ ఒకటి రద్దైంది. దీంతో భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
మాథ్స్‌లో తక్కువ మార్కులు వచ్చాయి.. బాగా కష్టపడి చదువు.. నీ భవిష్యత్తు కోసమే చెబుతున్నాఅంటూ తండ్రి మందలించిన తెల్లారే పదో తరగతి విద్యార్థిని అయిన కుమార్తె అపార్ట్‌మెంట్‌పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ‘ఇంకా ఎన్ని రోజులు సెలవు పెట్టి ఇంట్లో ఉంటావు.. ఉన్నది చాలు..