PM Modi: ఉడిపిలో లక్ష కంఠ గీతా పఠనం.. హాజరైన మోదీ
ABN , Publish Date - Nov 28 , 2025 | 03:02 PM
ఉడిపి రావడం తనకు ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తున్నానని మోదీ అన్నారు. జన్‌సంఘ్‌కు ఇది కర్మభూమి అని, బీజేపీ సుపరిపాలనా మోడల్‌కు ప్రేరణ అని చెప్పారు. 1968లో ఇక్కడి మున్సిపల్ కౌన్సిల్‌కు జన్‌సంఘ్ నేత వీఎస్ ఆచార్యను ఎన్నుకున్నారని గుర్తుచేశారు.
ఉడిపి: రామజన్మభూమి ఉద్యమంలో ఉడిపి ప్రాంతం పాత్ర ప్రశంసనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రశంసించారు. శ్రీ విశ్వేశ తీర్ధ స్వామి మార్గదర్శకంలో ఆలయ ఉద్యమం ఈరోజు అయోధ్యలో రామమందిరపై పతాకవిష్కరణ వరకూ దారితీసిందని కొనియాడారు. ఉడిపిలోని ప్రసిద్ధ శ్రీకృష్ణ మఠాన్ని ప్రధాని శుక్రవారంనాడు సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన లక్ష కంఠ భగవద్గీత పఠనంలో పాల్గొన్నారు.

అనంతరం ప్రధాని మాట్లాడుతూ, ఉడిపి రావడం తనకు ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తున్నానని అన్నారు. మరో కారణం కూడా ఉందని చెప్పారు. జన్‌సంఘ్‌కు ఇది కర్మభూమి అని, బీజేపీ సుపరిపాలనా మోడల్‌కు ప్రేరణ అని చెప్పారు. 1968లో ఇక్కడి మున్సిపల్ కౌన్సిల్‌కు జన్‌సంఘ్ నేత వీఎస్ ఆచార్యను ఎన్నుకున్నారని గుర్తుచేశారు. ఐదు దశాబ్దాల క్రితమే ఉడిపిలో న్యూ గవర్నెన్స్ మోడల్‌కు పునాదులు పడ్డాయని, జాతీయ విధానాలకు మార్గదర్శకంగా ఉడిపి నిలిచిందని అన్నారు. విశ్వేశ తీర్ధ స్వామీజీ అయోధ్య ఆలయ ఉద్యమానికి మార్గదర్శకం చేశారని చెప్పారు. అది ఈరోజు అయోధ్యలో పతాక ఆవిష్కరణ దారితీసిందని అన్నారు.
మూడ్రోజుల క్రితమే తాను భగవద్గీత పుట్టిన కురుక్షేత గడ్డపై ఉన్నానని, ఈరోజు శ్రీకృష్ణ భగవానుడు, శ్రీ జగద్గురు మధ్వాచార్య ఆశీస్సులతో తాను ఇక్కడికి రావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. లక్ష కంఠ భగవద్గీత పారాయణలో ప్రధాని తన గొంతు కలిపారు.
కనక మండప దర్శనం
ప్రధాని తన పర్యటనలో చారిత్రక కనక మండపాన్ని దర్శించారు. 14-15వ శతాబ్దం నాటి ప్రఖ్యాత సంకీర్తనాచార్యులు కనకదాసుకు ప్రధాని పుష్పాంజలి ఘటించారు. అనంతరం శ్రీకృష్ణ టెంపుల్ కాంప్లెక్స్‌కు వెళ్లారు. పర్యాయ పుతిగే మఠాధిపతి శ్రీ సుగుణేంద్ర స్వామి, మఠం దివాన్, సీనియర్ అధికారులు ప్రధానికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. వెండి పొదిగిన తులసీమాల, ముద్రలను ప్రధానికి అందజేశారు. ఉడిపి శ్రీకృష్ణుడి ఆలయాన్ని ప్రధాని దర్శించుకోవడం ఇది రెండోసారి. గుజరాత్ ముఖ్యమంత్రిగా 2008లో తొలిసారి ఆయన ఇక్కడకు వచ్చారు.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీ పొల్యూషన్.. మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు: రాహుల్ గాంధీ
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.