న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన మమ్దానీపై డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ మరోసారి విమర్శలు గుప్పించారు. మమ్దానీకి భారతీయులు నచ్చరని సంచలన కామెంట్ చేశారు. వాపపక్షవాద భావజాల వ్యాప్తిని సంప్రదాయవాదులు అడ్డుకోవాలని గతంలో కూడా ఎరిక్ ట్రంప్ పిలుపు నిచ్చారు.
తాను గవర్నర్ బాధ్యతలు చేపట్టిన తొలి రోజు సాయంత్రానికల్లా ఫ్లోరిడా ప్రభుత్వ శాఖల్లో పని చేస్తు్న్న హెచ్-1బీ వీసాదారులందరినీ తొలగిస్తానని అమెరికన్ ఇన్వెస్టర్ జేమ్స్ ఫిష్‌బర్న్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట సంచలనంగా మారింది.
పురుగు కుట్టడం ద్వారా పాడైన రెడ్ మీట్ బర్గర్ తిన్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆల్ఫా గాల్ సిండ్రోమ్ వచ్చి చనిపోయాడు. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వర్జీనియాలోని ‘యూవీఏ హెల్త్’కు చెందిన పరిశోధకుల బృందం సదరు వ్యక్తి మరణంపై పరిశోధనలు చేసింది. ఓ నివేదికను వెలువరించింది.
బంగ్లాదేశ్ అల్లర్ల కేసులో మాజీ ప్రధాని, ప్రస్తుతం భారత్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న నాయకురాలు షేక్ హసీనాకు ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఐసీటీ మరణశిక్ష విధించింది.....
రష్యాతో వ్యాపారాలు చేసే దేశాలపై మరింత కఠినంగా వ్యవహరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నారు. రష్యా నుంచి వస్తువులను దిగుమతి చేసుకునే భారత్ వంటి కొన్ని....
నిరసనల అణిచివేతకు హసీనా ప్రభుత్వం ఫైర్‌ఆర్మ్స్, హెలికాప్టర్లు సహా మారణాయుధాలను మోహరించిందని, ఫలితంగా పెద్దఎత్తున హింస చెలరేగి, మారణహోమం జరిగిందని న్యాయమూర్తి పేర్కొన్నారు.
కాంగో రాగి గనిలోని వంతెన కూలిపోయి 32 మంది మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటనా స్థలంలోనే సైనిక సిబ్బంది నుంచి తుపాకీ కాల్పులు వినిపించాయని, ఆ శబ్దాలు గనిలో పనిచేస్తున్న కార్మికులలో గందరగోళాన్ని సృష్టించాయని తెలుస్తోంది
భారతీయ యాత్రికులు మక్కాలో ప్రార్థనలు ముగించుకుని బస్సులో మదీనా వెళుతూ ఉన్నారు. వారు ప్రయాణిస్తున్న బస్సు 1.30 గంటల ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది.
దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న అవినీతి, నేరాలకు వ్యతిరేకంగా వేలాది మంది మెక్సికో యువకులు రోడ్ల మీదకు వచ్చి చేసిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్లేందుకు ఆందోళనకారులు తీవ్రంగా ప్రయత్నించారు.
అమెరికా నిషేధిత జాబితాలోని 12 దేశాల జనాలపై మరిన్ని ఆంక్షలకు ట్రంప్ సర్కారు సిద్ధమవుతోంది. నిషేధానికి ముందే అమెరికాకు వచ్చిన ఆయా దేశాల వారికి గ్రీన్ కార్డులు, ఇతర వీసాల జారీ మరింత కష్టతరంగా మార్చేలా కొత్త విధానంపై కసరత్తు చేస్తోంది.