బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా , ముఖ్యమంత్రి, జనతాదళ్ నేత నితీష్ కుమార్ శుక్రవారంనాడిక్కడ జరిగిన కార్యక్రమంలో కూటమి 'సంకల్ప్ పత్ర'ను విడుదల చేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సరెండర్ అయిందని.. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్‌కు బీజేపీ సరెండర్ అయిందని ఆరోపించారు.
తేజస్వి యాదవ్ చర్యపై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. నేతలే పరిశుభ్రతను పట్టించుకోకుంటే పర్యావరణం పట్ల పౌరులు జాగ్రత్తలు తీసుకుంటారని ఎలా అనుకోగలం? అని ఒక నెటిజన్ ప్రశ్నించారు.
మహాగట్‌బంధన్ తరఫున ముజఫర్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, అధికార బీజేపీ ఎన్నికల చోరీకి పాల్పడుతోందని విమర్శించారు. ఓటర్ అవకతవకలు, ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ఎన్నికల కమిషన్‌తో బీజేపీ కుమ్మక్కయిందని ఆరోపించారు.
బిహార్‌లో సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం లేవని, కేవలం ముగ్గురు నలుగురు బీజేపీ నేతలు రిమోట్ కంట్రోల్‌ను తమ చేతుల్లో పెట్టుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
బిహార్ ప్రతిష్టను పెంచేందుకు ప్రధానమంత్రి చేస్తున్న కృషిని అమిత్‌షా ప్రశంసించారు. మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌ను భారతరత్నతో గౌరవించారని అన్నారు. దేశ ప్రజాస్వామిక, సామాజిక వృద్ధిలో బిహార్ కృషికి ఇది సరైన గుర్తింపని అన్నారు.
బీజేపీపై మైనారిటీల్లో ఉన్న భయాన్ని ఆసరాగా తీసుకుని కాంగ్రెస్, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీలు ముస్లిం ఓట్లకు గాలం వేస్తున్నాయని, అయితే ఈ పార్టీలు బీజేపీని అడ్డుకోలేవని ఒవైసీ అన్నారు.
బిహార్‌లో 2005కు ముందు నిరక్షరాస్యత, నిరుద్యోగత, వలసలు ఉండేవని, ఉన్నత విద్య కోసం ఒక్క మంచి విద్యాసంస్థ కూడా ఉండేది కాదని, యువత చీకట్లో మగ్గేదని నితీష్ తెలిపారు. యువకులు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లి అక్కడ అవమానాలు పాలయ్యేవారని చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టో వాగ్దానం చేసింది. మేనిఫెస్టో మొదట్లోనే ఈ హామీ చోటుచేసుకుంది. 20 రోజుల్లో ప్రతి కుటుంబంలోని ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై బీఆర్ఎస్ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులకి నవీన్ యాదవ్ స్ట్రాంగ్ సవాల్ విసిరారు.