Share News

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలుపు కోసం బీజేపీ ఎత్తులు: డిప్యూటీ సీఎం మల్లు

ABN , Publish Date - Oct 30 , 2025 | 05:27 PM

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సరెండర్ అయిందని.. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్‌కు బీజేపీ సరెండర్ అయిందని ఆరోపించారు.

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలుపు కోసం బీజేపీ ఎత్తులు: డిప్యూటీ సీఎం మల్లు
TG Dy CM Mallu Bhatti Vikramarka

హైదరాబాద్, అక్టోబర్ 30: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపించేందుకు బీజేపీ ఎత్తులు వేస్తోందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. అందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సరెండర్ అయిందని.. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్‌కు బీజేపీ సరెండర్ అయిందని ఆరోపించారు. ఆ క్రమంలోనే బీఆర్ఎస్‌కు లబ్ది చేకూర్చేందుకే అజారుద్దీన్‌పై ఎన్నికల కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేసిందని తెలిపారు. అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం జరగకుండా ఉండేందుకు గవర్నర్‌పై బీజేపీ ఒత్తిడి తెస్తోందని విమర్శించారు.


జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెలుపల ఎన్నికల కోడ్ లేదన్నారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో విలేకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విలేకర్లతో మాట్లాడుతూ.. రాజస్థాన్‌లోని కరగ్‌పూర్ నియోజకవర్గంలో పోలింగ్‌కు ముందు అభ్యర్థిని మంత్రిగా బీజేపీ ప్రకటించిందన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.


అజారుద్దీన్.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అభ్యర్థి కూడా కాదు. అయినా అభ్యంతరం ఎందుకు?అంటూ సందేహం వ్యక్తం చేశారు.అ అయితే తమ ప్రభుత్వానికి స్పష్టత, సంకల్పం ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఇక వరద నష్టంపై అంచనా వేస్తున్నామని చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో చాలా వరకు ముందస్తు చర్యలు చేపట్టామని ఈ సందర్భంగా ఆయన వివరించారు.


నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల బరిలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థులను రంగంలోకి దింపాయి. అయితే ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించి.. తమ సత్తా చాటాలని అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఈ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకోవాలని కృత నిశ్చయంతో ఉంది. అందుకోసం ఈ అసెంబ్లీ స్థానం నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మాగంటి గోపినాథ్ గెలిచారు. అనారోగ్య కారణంగా ఆయన జూన్‌లో మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన భార్య సునీతకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించింది.


అలాగే బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డిని బరిలో నిలిపింది. గత ఎన్నికల్లో ఆయన ఇదే స్థానం నుంచి గెలిచి మూడో స్థానంలో ఆయన నిలిచిన విషయం విదితమే. మరో వైపు ఈ నియోజకవర్గంలో అభ్యర్థి గెలుపుపై మైనార్టీల ఓట్లు అధిక ప్రభావం చూపిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి కేబినెట్‌లో ముస్లిం మంత్రి ఒక్కరు కూడా లేరు. దీనిని ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తు్న్నారు.


అలాంటి వేళ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2023 ఏడాది చివరిల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అజారుద్దీన్ బరిలో నిలిచి.. రెండో స్థానంలో నిలిచారు. ఈ నేపథ్యంలో అజారుద్దీన్‌తోపాటు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ. కొదండరామ్‌ను గవర్నర్ కోటాలో శాసనమండలికి పంపాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన దస్త్రాన్ని గవర్నర్‌కు పంపింది. కానీ దీనికి గవర్నర్ ఆమోదం లభించలేదు.


పోని అజారుద్దీన్‌కు తొలుత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దీనికి బీఆర్ఎస్, బీజేపీలో మోకాలడ్డుతున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు గుప్పిస్తోంది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు నవంబర్ 11వ తేదీన జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న వెలువడనున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

డైవర్షన్ కోసమే వైసీపీ కుట్ర: ఎమ్మెల్యే ఎంఎస్ రాజు

టెక్నాలజీ సాయంతో తుపాన్ నష్టాన్ని తగ్గించాం: సీఎం చంద్రబాబు

Read Latest TG News And Telugu News

Updated Date - Oct 30 , 2025 | 05:39 PM