Cyclone Montha: టెక్నాలజీ సాయంతో తుపాన్ నష్టాన్ని తగ్గించాం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Oct 30 , 2025 | 04:07 PM
మొంథా తుపాన్ మనతో దాగుడుమూతలు ఆడిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అయితే టెక్నాలజీ సాయంతో ఈ తుపాన్ నష్టాన్ని తగ్గించామని ఆయన చెప్పారు. అంతర్వేది వద్ద తీరం దాటడంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయన్నారు.
అమరావతి, అక్టోబర్ 30: మొంథా తుపాన్ మనతో దాగుడుమూతలు ఆడి.. సమస్యలు సృష్టించిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అయితే టెక్నాలజీ సాయంతో ఈ తుపాన్ నష్టాన్ని తగ్గించామని ఆయన చెప్పారు. అంతర్వేది వద్ద తీరం దాటడంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయన్నారు. గురువారం అమరావతిలో మొంథా తుపాన్ నష్టంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాటిలైట్ ఇమేజ్‌ల ఆధారంగా తుపాన్ పరిస్థితిని అంచనా వేశామన్నారు. అంతర్వేది వద్ద తీరం దాటి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయని చెప్పారు.
అయితే కాకినాడలో ఈ తుపాన్ క్రాస్ చేస్తుందని అనుకున్నామని.. కానీ చివరకు నరసాపురం వద్ద తీరం దాటిందని సీఎం చంద్రబాబు వివరించారు. వారం రోజుల్లోనే పరిస్థితులను చక్కదిద్దామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పని చేశామని.. అయితే అనుకున్న చోట కాకుండా వేరే ప్రాంతాల్లో వర్షాలు కురిశాయని వివరించారు. ఈ తుపాన్ తీరం దాటినా.. తెలంగాణలో వర్షాలు అధికంగా కురిశాయని తెలిపారు. గతంలో బుడమేరు వరదను సైతం ఎదుర్కొన్నామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
భారీ వర్షాల కారణంగా ఎక్కడా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చేశామన్నారు. విపత్తుల సమయంలో అన్నింటినీ సరిచేశామని చెప్పారు. ఇక గ్రామ, వార్డు సచివాలయాలను యాక్టివ్ చేశామన్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అధికంగా వర్షాలు పడ్డాయని తెలిపారు. వర్షాల వల్ల వరదలు వచ్చాయని.. పులిచింతల వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరిందని వివరించారు.
పంట నష్టంపై నివేదిక అందజేయాలని అధికారులను సీఎం చంద్రబాబు కోరారు. ఐదు రోజుల్లో పంట నష్టంపై నివేదిక అందజేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఈ తుపాన్ కారణంగా.. వరి, మొక్కజోన్న, పత్తి, అరటి, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన నీరు.. అధికారులు అప్రమత్తం
మంత్రి నారా లోకేశ్ పేరిట రూ.54 లక్షలు మోసం..
Read Latest AP News And Telugu News