Share News

MS Raju: డైవర్షన్ కోసమే వైసీపీ కుట్ర: ఎమ్మెల్యే ఎంఎస్ రాజు

ABN , Publish Date - Oct 30 , 2025 | 04:44 PM

తనను లక్ష్యంగా చేసుకుని వైసీపీ చేస్తున్న ఆరోపణలను మడకశిర ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యుడు ఎంఎస్ రాజు గురువారం అమరావతిలో ఖండించారు.

MS Raju: డైవర్షన్ కోసమే వైసీపీ కుట్ర: ఎమ్మెల్యే ఎంఎస్ రాజు
Madakasira MLA MS Raju

అమరావతి, అక్టోబర్ 30: తనను లక్ష్యంగా చేసుకుని వైసీపీ చేస్తున్న ఆరోపణలను మడకశిర ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యుడు ఎంఎస్ రాజు గురువారం అమరావతిలో ఖండించారు. భగవద్గీతను తాను అవమానపరిచినట్లు వైసీపీ అసత్య ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. రాజ్యాంగం వల్ల దళితుల జీవిత ప్రమాణాలు మెరుగుపడ్డాయని తాను వ్యాఖ్యానించానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మొంథా తుపాన్ ప్రభావంతో ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్నసేవలను డైవర్ట్ చేసేందుకే వైసీపీ ఈ తరహా కుట్రకు తెర తీసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


తాను దళిత హిందువునని.. కానీ భూమన కరుణాకర్ రెడ్డిలాగా ఇంట్లో ఒక మతం, బయట పదవుల కోసం మరో మతం ఆచరించే వ్యక్తిని కాదంటూ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు స్పష్టం చేశారు. అయినా తాను చేసిన వ్యాఖ్యలకు హిందువుల మనోభావాలు దెబ్బతిని ఉంటే ఒక హిందూ సోదరుడిగా అందరికీ క్షమాపణలు చెబుతున్నానని ఆయన ప్రకటించారు.


టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డ్ సభ్యుడు ఎంఎస్ రాజు తాజాగా అనంతపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భగవద్గీతపై ఆయన వ్యాఖ్యలు చేశారంటూ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ఎంఎస్ రాజు బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్లు అధికమయ్యాయి.


అలాంటి వేళ.. ఎంఎస్ రాజు గురువారం మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. తాను చేసిన వ్యాఖ్యలను వైసీపీ వక్రీకరించిందన్నారు. అంతేకాదు.. తుపాన్ నష్టాన్ని భారీగా తగ్గించడంలో ప్రభుత్వం కృషి చేసిందని.. దీని నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే వైసీపీ ఈ కుట్రకు తెర తీసిందని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వివరించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన నీరు.. అధికారులు అప్రమత్తం

టెక్నాలజీ సాయంతో తుపాన్ నష్టాన్ని తగ్గించాం: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 30 , 2025 | 04:54 PM