సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గంజాయి చాకెట్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్లాట్ఫారం నంబరు 10లో మంగళవారం స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సీఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధి గట్టుపల్లి శివారులోని కోర్పోలు చంద్రారెడ్డి రిసార్టులో మంగళవారం రాత్రి జరుగుతున్న రేవ్ పార్టీని ఎస్వోటీ బృందం, మహేశ్వరం పోలీసులు భగ్నం చేశారు. 72 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
నకిలీ స్వచ్చంద సంస్థను సృష్టించి సైబర్ నేరగాళ్లు వాట్సాప్ డీపీగా బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఫొటోను పెట్టారు. రూ.లక్షల్లో రుణాలు ఇప్పిస్తానంటూ బురిడీ కొట్టించి నగరవాసి నుంచి రూ.7.9 లక్షలు కొల్లగొట్టారు. బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఓ యువతి బస్టాండ్‌లో వేచిఉండగా అదే మార్గంలో వెళ్తున్నామని, డ్రాప్ చేస్తామని నమ్మించి అత్యాచారానికి పాల్పడిన సంఘటన చిక్కబళ్ళాపుర జిల్లాలో వెలుగులోకి వచ్చింది. చిక్కబళ్ళాపురలో ఓ యువతి బస్సుకోసం వేచిఉండగా సికిందర్ బాబా అనే వ్యక్తి వచ్చి మాటలు కలిపాడు.
ఢిల్లీలోని సౌత్ ఏషియన్ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థిని తనపై అత్యాచార యత్నం జరిగిందని ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
యువకుడిని హత్యచేసి కాల్చేసిన ఘటన శ్రీసత్య సాయి జిల్లా హిందూపురం మండలంలోని సంతేబిదనూరు వద్ద జరిగింది. రూరల్ సీఐ జనార్దన్ తెలిపిన మేరకు సంతేబిదునూరు సమీపంలో కల్లుదుకాణం నిర్వహించే ప్రాంతంలో కాల్చివేసిన శవం ఉందని సోమవారం తెలిసిందన్నారు.
తమిళనాడు దిండుగల్ జిల్లా నిలకోట సమీపంలోవున్న రామనాయకన్‌పట్టిలో కులాంతర వివాహం చేసుకున్న రామచంద్రన్ (24) అనే యువకుడు దారుణహత్యకు గురైన నేపథ్యంలో, పోలీసులు పరువుహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రామచంద్రన్ పాడిపశువులు పెంచుతూ ఇంటింటికీ పాలు సరఫరా చేస్తూ, తమ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు.
చదువుకోకుండా ఇంటి వద్దనే ఉన్న కుమార్తెను చదువుకోమని తల్లి మందలించినందుకు ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అంబర్‌పేట పీఎస్ పరిధిలో జరిగింది.
నకిలీ ఆధార్, పాన్‌కార్డులతో ఓ ఉద్యోగి బ్యాంక్‌కు టోకరా వేశాడు. రూ.16.5 లక్షల అప్పు తీసుకుని మోసానికి పాల్పడ్డాడు. కంచన్‌బాగ్‌లోని ఎస్బీఐలో 2023 నవంబర్‌లో ఉప్పల్ హబ్సిగూడ నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో సీనియర్ టెక్నికల్ ఆఫీసర్‌గా పని చేస్తున్న ఉద్యోగి ప్రవీణ్ తన ఆధార్, పాన్‌కార్డు, మూడు నెలల పేస్లిప్‌లను బ్యాంక్ అధికారులకు అందించి పర్సనల్ ఎక్స్‌ప్రెస్ లోన్ కింద రూ.16.50లక్షల రుణం పొందాడు.
జార్ఘండ్ రాజధాని రాంచీలోని రతు ప్రాంతంలో 14 ఏళ్ల బాలిక తన కుటుంబంతో నివాసం ఉంటుంది. అయితే ఆదివారం ఆ బాలికపై కామాంధులు కాటేశారు. రాత్రి సమయంలో 9 మంది వ్యక్తులు ఆ బాలికపై అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు.