Share News

Ananthapuram News: రైతులపై వైసీపీ నాయకుడి దౌర్జన్యం - ఇద్దరికి గాయాలు

ABN , Publish Date - Jan 01 , 2026 | 11:55 AM

జిల్లాలోని ఆయా మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తల దౌర్జన్యాలకు అంతేలేకుండా పోతోంది. ఆ పార్టీ అధినేత జగన్ పుట్టినరోజు సందర్బంగా రప్పా రప్పా అంటూ ప్లెక్సీలు పెట్టి అలజడి చేశారు. తాజాగా మరో నాయకుడు, ఆయన కొడుకు దాడిచేసిన విషయం వెలుగులోకి వచ్చింది.

Ananthapuram News: రైతులపై వైసీపీ నాయకుడి దౌర్జన్యం  - ఇద్దరికి గాయాలు

యల్లనూరు(అనంతపురం): మండలంలోని తిమ్మంపల్లి(Timmampalli)లో రామచంద్రారెడ్డి, సతీష్‏రెడ్డి అనే రైతులపై వైసీపీకి చెందిన మల్లారెడ్డి, అతడి కుమారులు దాడి చేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. సతీష్‏రెడ్డికి చెందిన భూమిని 15 నెలల క్రితం రామచంద్రారెడ్డి కొనుగోలు చేశాడు. ఈ పొలంలో బుధవారం ఉదయం ఎక్స్‌కవేటర్‌ సాయంతో పనిచేస్తుండగా.. మల్లారెడ్డి, అతడి కొడుకు భరత్‌ కలిసి తాము కొనాలనుకున్న భూమి నువ్వెలా కొని సాగుచేస్తావు అంటూ రామచంద్రారెడ్డిపై దాడిచేశారు.


pandu3.2.jpg

ఈ విషయం తెలిసి సతీష్ రెడ్డి తోట వద్దకు రాగా మరోసారి మల్లారెడ్డి, భరత్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి కలిసి సతీష్ రెడ్డిపై దాడిచేశారు. భూమి అమ్మనందుకే తనపై దాడిచేశారని సతీష్ రెడ్డి వాపోయారు. దీనిపై యల్లనూరు పోలీస్‏స్టేషన్‌(Yellanuru Police Station)లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'కల్కి-2' షూటింగ్‌కు డార్లింగ్!

రానూపోనూ టికెట్లు బుక్‌ చేస్తే 10శాతం రాయితీ

Read Latest Telangana News and National News

Updated Date - Jan 01 , 2026 | 11:55 AM