బహిరంగ మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు, పామాయిల్‌తోపాటు.. పంచదార, గోధుమపిండిని రాయితీ ధరకు సరఫరా చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2024 సార్వత్రిక ఎన్నికలు సరికొత్త చరిత్ర లిఖించాయి. ‘వై నాట్ 175‘ అంటూ బరిలోకి దిగిన వైసీపీని 11స్థానాలకే కట్టడి చేస్తూ.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏకంగా 164 స్థానాల్లో జైత్రయాత్ర సాగించింది.
పన్నెండవ వేతన సవరణ కమిషన్ (పీఆర్‌సీ) చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్‌కుమార్‌ను నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఒకట్రెండు రోజుల్లో నియామక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
ఎవరికి ఇష్టం ఉన్నా, లేకపోయినా అమరావతిని అడ్డుకోలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఒకవేళ ఎవరైనా అందుకు ప్రయత్నిస్తే అమరావతే వారి అంతు చూస్తుందని ఆయన హెచ్చరించారు.
ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు తమిళ స్మగర్లను అరెస్టు చేసి వారి నుంచి 6 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు పీలేరు అటవీ శాఖ ఎఫ్‌ఎ్‌సవో సబిహా సుల్తానా తెలిపారు.
మదనపల్లె పట్టణంలో కలసిపోయిన బీకేపల్లె ప్రాంతం బైపాస్ రోడ్డు నిత్యం వాహనాల రణగొణ ధ్వనులతో ఉండేది. శు క్రవారం హార్టికల్చర్ హబ్ శంకుస్థాపన కోసం సీఎం చంద్రబాబు రానుండటంతో ఈ ప్రాంతం రెండు రోజులుగా మంత్రులు, అధికారులు, టీడీపీ నాయకుల పరిశీలనతో సందడిగా మారింది.
గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌తో రాయలసీమ రూపురేఖలు మారడం ఖాయమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. స్థానిక కేజీఎన్ కల్యాణ మండపంలో బుధవారం టీడీపీ తంబళ్లపల్లె ఇన్‌చార్జి జి.శంకర్‌యాదవ్ అధ్యక్షతన సీఎం చంద్రబాబు పర్యటన, స్థానిక ఎన్నికలపై కూటమి నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
తిరుపతి ఎకనామిక్ రీజియన్(టీఈఆర్) ప్రణాళిక రూపకల్పనకు క్షేత్రస్థాయి భాగస్వాముల సూచనలు ఎంతో కీలకమని టీఈఆర్ సీఈవో ముఖేష్ కుమార్ మీనా అభిప్రాయపడ్డారు.
వెంకటగిరి గ్రామశక్తిగా పేరుగాంచిన పోలేరమ్మ జాతర సంబరాలతో పట్టణం హోరెత్తిపోయింది.బుధవారం ఉదయమే పోలేరమ్మ పుట్టింటి వారుగా భావించే కుమ్మర్లు వెంకటగిరి చెరువు నుంచి తీసుకు వచ్చిన మట్టితో ప్రతిమను తయారు చేయడంలో నిమగ్నమయ్యారు.పుట్టింటి వద్ద అమ్మవారిని భక్తుల దర్శనార్థం ఉంచేందుకు వేపమండలతో పందిరిని సిద్ధం చేశారు.
జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో నాయుడుపేటకు చెందిన తరుమూరు గణేష్ మణిరత్నం స్వర్ణపతకం కైవసం చేసుకోవడంపై అభినందనలు వెల్లువెత్తుఉన్నాయి.