రైతులను తప్పుదోవ పట్టించేలా కొంతమంది అబద్ధపు కథనాలు పత్రికలలో రాస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
రాజధానిలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. ఎప్పుడూ కూడా వేంకటేశ్వర స్వామికి అప్రతిష్ట పాలు తెచ్చే పనిని చెయ్యనని.... ఎవరినీ చేయనివ్వనని స్పష్టం చేశారు.
రాజధాని రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కమిటీ మరోసారి సమావేశమైంది. రైతుల ప్లాట్లకు హద్దు రాళ్లు వేసి వెంటనే అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది.
రైతుల మీద మొసలికన్నీరు కారుస్తున్న సజ్జల గత ఐదేళ్లల్లో ఏం చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ప్రశ్నల వర్షం కురిపించారు. గంజాయిని సాగు చేయించి కోట్లు దండుకున్నారని ఆరోపించారు. జగన్ అండ్ కో పాల్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారని ఎద్దేవా చేశారు.
తిరుమల పరకామణి కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి మరోసారి సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఈకేసులో పలువురు అధికారులను విచారించిన అనంతరం ధర్మారెడ్డిని సీఐడీ మరోసారి విచారణకు పిలిచింది.
ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్న రోజు ఈ రోజు అని తెలిపారు. పిల్లలకు అర్ధం అయ్యేలా బాలల భారత రాజ్యాంగాన్ని పుస్తకరూపంలో తీసుకొచ్చామని వెల్లడించారు.
ఏపీ మాక్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 175 నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులు మాక్ అసెంబ్లీలో పాల్గొన్నారు.
వైసీపీ విద్యార్థి విభాగం నేత కొండారెడ్డిపై నమోదైన డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనపై పీటీ వారెంట్‌ను అనుమతించింది విజయవాడ కోర్టు.
కృష్ణా జిల్లాలోని గుడివాడ యూనియన్ బ్యాంకులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బైపాస్ రోడ్డులోని బ్యాంక్ కార్యాలయం నుంచి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.