ధవలేశ్వరం బ్యారేజ్ గేట్లకు రూ.150 కోట్ల నిధులు: మంత్రి నిమ్మల రామానాయుడు
ABN , Publish Date - Feb 17 , 2026 | 04:19 PM
ధవలేశ్వరం బ్యారేజ్ గేట్ల మరమ్మతుల కోసం రూ.150 కోట్లు మంజూరు చేసినట్టు మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. పాడైపోయిన గేట్లను తొలగించి కొత్త గేట్లను అమర్చనున్నట్ల ఏపీ అసెంబ్లీలో మంత్రి తెలిపారు..
రాజమండ్రి, ఫిబ్రవరి 17: ధవలేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ గేట్ల దుస్థితిపై ఏబీఎన్ ఛానల్‌లో వరుసగా కథనాలు ప్రసారం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) కీలక ప్రకటన చేశారు. నాడు బ్యారేజ్‌కు నిధులు ఇచ్చిన చంద్రబాబే.. మళ్లీ నేడు ధవలేశ్వరం బ్యారేజ్ కొత్త గేట్ల ఏర్పాటుకు రూ.150 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా పాడైపోయిన గేట్లను తొలగించి కొత్త గేట్లను అమర్చనున్నట్టు వెల్లడించారు.
బ్యారేజ్‌లోని 117 గేట్లను తొలగించి వాటి స్థానంలో అధునాతనమైన కొత్త గేట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ పనుల ద్వారా గోదావరి జలాలు సమర్థవంతంగా నిల్వ ఉండి, డెల్టా ప్రాంత రైతులకు సాగునీటి సమస్యలు తగ్గుతాయని ఆయన తెలిపారు. ఈ సీజన్‌లోనే అన్ని పనులు పూర్తి చేసి, కొత్త గేట్లను పూర్తి స్థాయిలో అమర్చనున్నట్లు మంత్రి రామానాయుడు ప్రకటించారు. టెండర్లు, ఇతర చర్యలు వేగంగా పూర్తి చేసి త్వరితగతంగానే కొత్త గేట్లను ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
గతంలో 2014-19లో ధవలేశ్వరం గేట్లు ప్రమాదకరంగా ఉన్నాయని.. టీడీపీ ప్రభుత్వంలో 58 కొత్త గేట్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి గుర్తుచేశారు. తిరిగి ఇప్పుడు మిగిలిన 117 గేట్లను కూడా కొత్తవి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 2019-24 మధ్య కాలంలో ధవలేశ్వరం గేట్లు ప్రమాదకరంగా ఉన్నాయని సీడబ్బ్యూసీ హెచ్చరించినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
ఎమ్మెల్యేలు సభకు రాకపోతే జీతాలు కట్.. ప్రజలు రీకాల్ చేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు
Read Latest AP News And Telugu News