Home » Andhra Pradesh » Guntur
భూ సంస్కరణలపై శుక్రవారం ఏపీ సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో ఈ భేటీ జరిగింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో ఓ సందర్భంలో వాలంటీర్లు సేకరించిన సమాచారం అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్తుందని... మహిళలు అపహరణకు గురి అవుతున్నారని వ్యాఖ్యానించారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలపై క్రిమినల్ కేసు దాఖలు చేసింది. గురువారం ఈ కేసు పిటీషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది.
తెలుగుదేశం పార్టీలో బాధ్యత లేకుండా ప్రవర్తించే నేతలని ఇక మీదట ఉపేక్షించబోనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. టీడీపీలో కొందరు నేతల క్రమశిక్షణా రాహిత్యంపై, మీడియా, సోషల్ మీడియాల్లో రచ్చకు దిగడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూఏఈలో పర్యటిస్తున్నారు. యూఏఈ పర్యటనలో భాగంగా రెండో రోజు అబుదాబీలో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా పారిశ్రామిక వేత్తలతో సమావేశం అవుతున్నారు. ఈ భేటీల్లో ఏపీకి కావాల్సిన పెట్టుబడులపై సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు.
రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. డ్రైనేజీ, ఇరిగేషన్, భద్రతా చర్యల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు.
రెండో రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ అబుదాబిలో పర్యటించనున్నారు. పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశాలు జరపనున్నారు.
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. దీని ప్రభావంతో నేడు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో..
కోనసీమ జిల్లాలో అక్టోబర్ 8వ తేదీన బాణాసంచా పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 10 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. అయితే, మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు పరిహారం ప్రకటించారు.
రాజధాని అమరావతి నిర్మాణంతోపాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మంగా ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా పట్టణాలలో తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేసింది.