తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..
ABN , Publish Date - Apr 08 , 2026 | 04:45 PM
తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణ పరిస్థితులపై కీలక అప్‌డేట్ వచ్చింది. రెండు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములు, మెరుపులతోపాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
హైదరాబాద్/అమరావతి, ఏప్రిల్ 08: తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణ పరిస్థితులపై కీలక అప్‌డేట్ వచ్చింది. రెండు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములు, మెరుపులతోపాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి తెలంగాణ, రాయలసీమతోపాటు తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర, దక్షిణ ద్రోణి ఏర్పడిందని పేర్కొంది. దీని ప్రభావంతో ఏపీలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు చేసింది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం..
బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లలు ఒకటి రెండు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు వేగంతో వీస్తాయని చెప్పింది. ఇక గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వివరించింది.
దక్షిణ కోస్తా ఏపీలో..
బుధ, గురు వారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందంది. ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయంది. శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందంది.
రాయలసీమలో..
బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. గురు, శుక్ర వారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని పేర్కొంది.
తెలంగాణలో రాగల మూడు రోజుల వాతావరణ పరిస్థితులు..
ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల చక్రవాత ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో బుధవారం ఏర్పడిందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఈ రోజు (బుధవారం) తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఒకటి రెండు జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. రానున్న మూడు రోజులు రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు రాష్ట్రంలోని ఒకటి.. రెండు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణపై ఫోకస్: ఎంపీ లక్ష్మణ్
ఇలా చేస్తే ఉపేక్షించేది లేదు.. టీడీపీ నేతలపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం
For More TG News And Telugu News