గోవాలోని పోండా ఉపఎన్నిక రద్దు... ఈసీ నోటీఫికేషన్ చెల్లదని ప్రకటించిన హైకోర్టు
ABN , Publish Date - Apr 08 , 2026 | 04:13 PM
గోవాలోని పోండా అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికపై బాంబే హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఈనెల 9న ఉప ఎన్నిక జరగాల్సి ఉండగా, ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ చెల్లదని హైకోర్టు బుధవారంనాడు తీర్పుచెప్పింది.
పనజి: గోవా(Goa)లోని పోండా (Ponda)అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికపై బాంబే హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఈనెల 9న ఉప ఎన్నిక జరగాల్సి ఉండగా, ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ చెల్లదని హైకోర్టు బుధవారంనాడు తీర్పుచెప్పింది.
గోవా వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన రవి నాయక్ గత అక్టోబర్‌లో మరణించడంతో పోండా నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఏప్రిల్ 9న ఉప ఎన్నికల తేదీని ఈసీ ప్రకటించింది. అయితే ఈసీ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ ఇద్దరు ఓటర్లు పిటిషన్లు వేశారు. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం ఏడాది కంటే తక్కువ ఉందని, అందువల్ల ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఉపఎన్నిక నిర్వహించడం తప్పనసరికాదని పిటిషనర్లు తమ వాదన వినిపించారు. దీనిపై న్యాయమూర్తులు వాల్మీకి మెనెజెస్, అమిత్ జంసండేకర్ (గోవా బెంచ్)తో కూడిన ధర్మాసనం విచారణ జరిపి ఈసీ నోటిఫికేషన్ చెల్లదని ప్రకటించింది. దీంతో ఈనెల 9న జరగాల్సిన పోండా ఉపఎన్నిక రద్దయింది.
ఇవి కూడా చదవండి..
బెంగాల్ ఎన్నికలు... మమతా బెనర్జీ నామినేషన్
ఈసీతో టీఎంసీ సమావేశంలో రసాభాస.. పరస్పరం ఆరోపణలు