Share News

ఈసీతో టీఎంసీ సమావేశంలో రసాభాస.. పరస్పరం ఆరోపణలు

ABN , Publish Date - Apr 08 , 2026 | 03:31 PM

తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం, ఎన్నికల సంఘం మధ్య బుధవారంనాడిక్కడ జరిగిన సమావేశం రసాభాసగా ముగిసింది. ఏడు నిమిషాల పాటు జరిగిన సమావేశంలో ఇరువర్గాలు పరస్పర ఆరోపణలకు దిగడంతో ఉద్రిక్తత తలెత్తింది.

ఈసీతో టీఎంసీ సమావేశంలో రసాభాస.. పరస్పరం ఆరోపణలు
TMC leader Derek O'Brien

న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం, ఎన్నికల సంఘం మధ్య బుధవారంనాడిక్కడ జరిగిన సమావేశం రసాభాసగా ముగిసింది. ఏడు నిమిషాల పాటు జరిగిన సమావేశంలో ఇరువర్గాలు పరస్పర ఆరోపణలకు దిగడంతో ఉద్రిక్తత తలెత్తింది. టీఎంపీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ పెద్దగా కేకలు వేస్తూ సీఈసీని మాట్లాడకుండా అడ్డుకున్నారని ఈసీ వర్గాలు ఆరోపించాయి. అయితే ఎన్నికల అధికారులకు బీజేపీతో సంబంధాలున్న నిర్దిష్ట ఉదంతాలను సీఈసీ ముందుకు లెవనెత్తామని, దాంతో తనను సమావేశం బయటకు వెళ్లిపొమ్మని సీఈసీ అగ్రహం వ్యక్తం చేశారని సమావేశానంతరం డెరిక్ ఒబ్రెయిన్ ఆరోపించారు.


పశ్చిమబెంగాల్ ఓటర్ల జాబితా నుంచి 91 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించడంపై టీఎంసీ ప్రతినిధి బృందం సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను కలిసిందని, అయితే తమ ఆందోళనలను సీఈసీ ఏమాత్రం పట్టించుకోలేదని డెరిక్ ఒబ్రెయిన్ తెలిపారు. 'ఏడు నిమిషాల సమావేశంలో సీఈసీ ఏమి చెప్పారో మీకు చెప్పాలనుకుంటున్నాను. 'గెట్ లాస్ట్' అన్నారు. మేము పార్లమెంటులో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్నాము' అని డెరిక్ ఒబ్రెయిన్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.


కాగా, ఈసీ పనితీరు దయనీయంగా ఉందనడానికి సీఈసీతో జరిగిన సమవేశమే నిదర్శనమని ఆ పార్టీ ఎంపీలు విమర్శించారు. దీనిపై భావసారూప్యత కలిగిన విపక్ష పార్టీలతో సాయంత్రం 5 గంటలకు కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు ఆ పార్టీ ఎంపీ సాగరిక ఘోష్ చెప్పారు.


ఇవి కూడా చదవండి..

బెంగాల్ ఎన్నికలు... మమతా బెనర్జీ నామినేషన్

కేరళం ఎన్నికలు.. 2011 ఫలితాలు రిపీట్ అవుతాయా?

Updated Date - Apr 08 , 2026 | 03:35 PM