ఉత్తర, మధ్య భారతం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ
ABN , Publish Date - Oct 04 , 2026 | 04:50 AM
ఉత్తర, వాయవ్య భారతంలో పొడి వాతావరణం, రాజస్థాన్ పరిసరాల్లో అధిక పీడనం నేపథ్యంలో ఉత్తర, మధ్య భారతంలోని పలు ప్రాంతాల నుంచి నైరుతి ..
విశాఖపట్నం, అమరావతి, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): ఉత్తర, వాయవ్య భారతంలో గత కొద్దిరోజులుగా పొడి వాతావరణం నెలకొంది. వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీనికి తోడు రాజస్థాన్ పరిసరాల్లో యాంటీ సైక్లోన్(అధిక పీడనం) ఏర్పడింది. వీటిని ప్రామాణికంగా తీసుకుని ఉత్తర భారతదేశంతోపాటు మధ్య భారతదేశంలోని పలు ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించినట్టు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శనివారం ప్రకటించింది. కాగా, రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. కర్నూలులో 37 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం ఉత్తర కోస్తాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి: