బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. డిసెంబర్ 2న వాయుగుండంగా మారే ఛాన్స్
ABN , Publish Date - Nov 27 , 2026 | 01:49 PM
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించారు. దక్షిణ అండమాన్ సముద్రంపై ఏర్పడే ఉపరితల ఆవర్తన ప్రభావంతో నవంబర్ 30వ తేదీ నాటికి అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
అమరావతి, నవంబర్ 27: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించారు. దక్షిణ అండమాన్ సముద్రంపై ఏర్పడే ఉపరితల ఆవర్తన ప్రభావంతో నవంబర్ 30వ తేదీ నాటికి అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఆపై ఈ అల్పపీడం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.
డిసెంబర్ 2వ తేదీకి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు లేదా శ్రీలంక తీరాల వైపు కదిలే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. అయితే వివిధ వాతావరణ మోడల్స్ ప్రకారం ఈ వాయుగుండం సముద్రంలోనే బలహీనపడే సూచనలు కనిపిస్తున్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఇవి కూడా చదవండి...
విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ బాధ్యతల స్వీకరణ
ఏపీ పోలీస్ శాఖలో 1,534 ఉద్యోగాలకు నోటిఫికేషన్
Read Latest AP News And Telugu News