Share News

కోస్తాంధ్రకు తుపాను ముప్పు.. 19 నుంచి అతి భారీ వర్షాలు

ABN , Publish Date - Nov 15 , 2026 | 08:36 PM

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. మరింతగా బలపడి ఆదివారం తీవ్ర వాయుగుండంగా మారుతుందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ వెల్లడించింది.

కోస్తాంధ్రకు తుపాను ముప్పు.. 19 నుంచి అతి భారీ వర్షాలు
Cyclone in AP

విశాఖపట్నం, నవంబర్15: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. మరింతగా బలపడి ఆదివారం తీవ్ర వాయుగుండంగా మారుతుందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతం‌లోనే ఇది తుపానుగా మారుతుందని పేర్కొంది. ఇది మరింత బలపడి.. నవంబర్ 17వ తేదీన తీవ్ర తుపానుగా మారి.. ఆ మరుసటి రోజుకి (నవంబర్ 18) అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వివరించింది.


ఈ నేపథ్యంలో నవంబర్ 19 నుంచి కోస్తా అంతటా అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం కోస్తాంధ్రలోనే తీరం దాటే అవకాశం కనిపిస్తోందని పేర్కొంది. అతి తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని చెప్పింది. కళింగపట్నం మినహా అన్ని పోర్ట్‌లల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడివాడలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి 250 మంది

ఒకేసారి రెండు తుపాన్లతో ఏపీకి భారీ నష్టం: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 15 , 2026 | 09:07 PM