ఏపీలో మరో 3 రోజులు వర్షాలు.. 16 వరకు పిడుగులతో కూడిన వానలు
ABN , Publish Date - Oct 13 , 2026 | 05:33 PM
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణితోపాటు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వివరించారు.
అమరావతి, అక్టోబర్13: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణితోపాటు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వివరించారు. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. అక్టోబర్14 నుంచి 16వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని చెప్పారు. 14వ తేదీన 11 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అన్నారు.
ఇక 15వ తేదీన కోనసీమ, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. 16వ తేదీన అల్లూరి, పోలవరం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అయితే వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ప్రఖర్ జైన్ స్పష్టం చేశారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద నిలబడవద్దు అని సూచించారు. భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడ వద్దని స్పష్టం చేశారు.
బుధవారం (14-10-2026)
పార్వతీపురం మన్యం, పోలవరం, విశాఖపట్నం, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి.
గురువారం (15-10-2026)
కోనసీమ, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయి. మరో 17 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శుక్రవారం (16-10-2026)
అల్లూరి, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయి. పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
కాసేపట్లో భేటీ కానున్న సీఎం చంద్రబాబు, సీఎం విజయ్.. ఈ అంశాలపై చర్చించే అవకాశం..!
కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Read Latest Weather News And Telugu News