తుపాను నేపథ్యంలో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ప్రఖర్ జైన్
ABN , Publish Date - Nov 16 , 2026 | 02:51 PM
ఏపీకి మరో తుపాను ముప్పు పొంచి ఉందని.. ఈ నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
అమరావతి, నవంబర్ 16: ఏపీకి మరో తుపాను రాబోతోందని.. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. ముఖ్యంగా తీరప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర వాయుగుండంగా మారిందని.. గడచిన 6 గంటల్లో.. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ వాయుగుండం.. చెన్నైకు 650 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి 730 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయిందన్నారు. ఈ వాయుగుండం సాయంత్రానికి తుపానుగా బలపడే అవకాశం ఉందని.. శుక్రవారానికి తీవ్ర తుపానుగా మారి.. నెల్లూరు- తుని మధ్య ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేశామన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
సొంత వైద్యం.. ప్రాణాలకే ముప్పు
ఏపీలో జోరుగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు..!