Share News

బంగాళాఖాతంలో వాయుగుండం.. గంటకు 5 కి.మీ వేగంతో..

ABN , Publish Date - Oct 25 , 2026 | 03:56 PM

ఆగ్నేయ, తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గంటకు 5 కి.మీ వేగంతో కదులుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎమ్ఏ) తెలిపింది.

బంగాళాఖాతంలో వాయుగుండం.. గంటకు 5 కి.మీ వేగంతో..

అమరావతి, అక్టోబర్ 25: ఆగ్నేయ, తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గంటకు 5 కి.మీ వేగంతో కదులుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎమ్ఏ) తెలిపింది. ప్రస్తుతానికి ఇది విశాఖకు 870 కి.మీ., కాకినాడకు 960 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందని వివరించింది. ఇవాళ తీవ్ర వాయుగుండంగా, రేపు తుఫానుగా బలపడే అవకాశముందని హెచ్చరించింది. ఈ వాయుగుండం ఈ నెల 27న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా బలపడుతుందని, 28న అతి తీవ్ర తుఫానుగా మారుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.


ఈనెల 28.. మధ్యాహ్నం నాటికి ఈ వాయుగుండం బాపట్ల- విశాఖ మధ్య తీరం దాటే అవకాశముందని ఏపీఎస్‌డీఎమ్ఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది తీరం దాటే సమయంలో గంటకు 115-125 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తుఫాన్ ప్రభావం తగ్గే వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని కోరారు. బీచ్‌లలో ఎగసిపడే అలలు వద్ద సెల్ఫీలు దిగే ప్రయత్నం చేయరాదని చెప్పారు.


ఈ వార్తలూ చదవండి

ఏపీకి తుపాను ముప్పు.. హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు

నేటి నుంచి ఢిల్లీకి ఆకాశ విమాన సర్వీసు

Updated Date - Oct 25 , 2026 | 03:56 PM