Share News

ఏపీకి మరో తుపాను గండం.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన!

ABN , Publish Date - Nov 16 , 2026 | 08:40 AM

రాష్ట్రానికి మరో తుపాను ముప్పు ముంచుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్రవాయుగుండంగా మారింది. ఇది దక్షిణమధ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలోకి చేరుకుని నేడు(సోమవారం) సాయంత్రానికి తుపానుగా మారే అవకాశం ఉంది.

ఏపీకి మరో తుపాను గండం..  ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన!
AP Cyclone Alert

అమరావతి, నవంబర్ 16: రాష్ట్రానికి మరో తుపాను ముప్పు ముంచుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్రవాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం అండమాన్ దీవులకు 640 కి.మీ., చెన్నైకి 760 కి.మీ., విశాఖపట్నంకు 870 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో గంటకు 8 కి.మీ. వేగంతో ఇది కదులుతున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ తెలిపారు.


ఈ వాయుగుండం దక్షిణమధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకుని నేడు(సోమవారం) సాయంత్రానికి తుపానుగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత 48 గంటల్లో కోస్తాంధ్ర తీర ప్రాంతానికి చేరుకునే సూచనలున్నాయి. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్రలో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఆ రెండు రోజులు కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున, ప్రజలు, రైతులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.


ఈ వార్తలూ చదవండి

ఎన్విడియా పగ్గాలు మళ్లీ హువాంగ్ చేతికేనా?.. రంగంలోకి టెక్ దిగ్గజాలు..!

విడాకుల తరువాత జీవితంలోకి కొత్త నేస్తం.. వరాహంతో స్నేహబంధం!

యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 181 సీట్లు అడుగుతోంది: అఖిలేశ్ యాదవ్

Updated Date - Nov 16 , 2026 | 08:56 AM