కార్తీక మాసం.. తొలి సోమవారం.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు!
ABN , Publish Date - Nov 16 , 2026 | 08:34 AM
పవిత్ర కార్తీక మాసంలో తొలి సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: పవిత్ర కార్తీక మాసంలో తొలి సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించి, శివయ్యను దర్శించుకున్నారు. అనంతరం శివనామస్మరణతో దీపారాధన చేశారు. కార్తీక దీపాల కాంతుల మధ్య ఆలయ ప్రాంగణాలు శోభాయమానంగా వెలిగాయి. అనంతరం విశేష పూజలు నిర్వహించి భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే ప్రత్యేక అర్చనలు, అభిషేకాలూ చేశారు. భక్తుల తాకిడితో దేవాలయాలు కిటకిటలాడాయి.





ఈ వార్తలూ చదవండి