Share News

ప్రజలు సంతోషంగా ఉంటే జగన్‌కు నచ్చదు

ABN , Publish Date - Nov 16 , 2026 | 05:03 AM

ప్రజలు సంతోషంగా ఉంటే చూసి తట్టుకోలేని మానసిక స్థితిలో మాజీ సీఎం జగన్‌ ఉన్నారని స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌వ్యాఖ్యానించారు.

ప్రజలు సంతోషంగా ఉంటే జగన్‌కు నచ్చదు

  • ఏఈఐ ర్యాంకులపై క్రెడిట్‌ చోరీకి యత్నం: కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌

అమరావతి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రజలు సంతోషంగా ఉంటే చూసి తట్టుకోలేని మానసిక స్థితిలో మాజీ సీఎం జగన్‌ ఉన్నారని స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌వ్యాఖ్యానించారు. ‘సెంటర్‌ ఫర్‌ న్యూ ఎకనామిక్‌ స్టడీస్‌’ విడుదల చేసిన యాక్సెస్‌ ఈక్వాలిటీ ఇండెక్స్‌ (ఏఈఐ)-2026 నివేదికలో ఆంధ్రప్రదేశ్‌ జాతీయ స్థాయిలో రెండో స్థానాన్ని, పెద్ద రాష్ట్రాల విభాగంలో మొదటి స్థానాన్ని దక్కించుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ... తన పాలనలో అన్ని వ్యవస్థలనూ విధ్వంసం చేసిన జగన్‌ కూటమి ప్రభుత్వ ప్రగతిని చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. రాష్ర్టానికి జాతీయ స్థాయిలో గుర్తింపురాగానే దానికి తానే కారణమంటూ క్రెడిట్‌చోరీకి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఈ వార్తలనూ చదవండి:

సొంత వైద్యం.. ప్రాణాలకే ముప్పు

ఏపీలో జోరుగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు..!

Updated Date - Nov 16 , 2026 | 05:08 AM