నాగర్ కర్నూల్ జిల్లాలో విద్యార్థుల ఆందోళన

ABN, Publish Date - Feb 19 , 2026 | 09:35 AM

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. వెల్దండ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థినులు ఆరోపించారు.

నాగర్ కర్నూల్ జిల్లా, ఫిబ్రవరి 19: కల్వకుర్తిలో విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. వెల్దండ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థినులు ఆరోపించారు. బుధవారం శ్రీశైలం- హైదరాబాద్ ప్రధాన రహదారిపై విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ ఘటనలో నలుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు వేధిస్తున్నారని, వారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం వీడియోను వీక్షించండి.


ఈ వార్తలు కూడా చదవండి..

కనిపించిన నెలవంక.. నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు

శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు..

Updated at - Feb 19 , 2026 | 09:43 AM